రకుల్ ప్రీత్ సింగ్, దీపిక, సారా, శ్రద్దాలకు ఎన్‌సీబీ సమన్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Sep 2020 1:18 PM GMT
రకుల్ ప్రీత్ సింగ్, దీపిక, సారా, శ్రద్దాలకు ఎన్‌సీబీ సమన్లు

డ్రగ్స్‌ కేసు బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో డ్రగ్స్‌ కోణం బయటపడటంతో రంగంలోకి దిగిన ఎన్‌సీబీ(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారుల దర్యాప్తులో కొత్త పేర్లు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె సోదరుడితో పాటు పలువురిని ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరికొందరు హీరోయిన్లకు సమన్లు జారీ చేశారు. దీపికా పదుకుణె, సారా అలీఖాన్‌, శ్రద్దా కపూర్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సమన్లు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మూడు రోజుల్లో హాజరు కావాలని నోటిసుల్లో పేర్కొన్నారు.

ఈ కేసులో బాలీవుడ్ ఇండస్ట్రీతో ఉన్న సంబంధాలపై ఇప్పటికే పలువురిని ఎన్సీబీ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా దీపికా పదుకోనే మేనేజర్ కరిష్మా ప్రకాష్‌ను ప్రశ్నించగా.. మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. రకుల్ ప్రీత్ సింగ్‌, సైమన్ కంబాట్టాను సెప్టెంబర్ 24న, దీపిక పదుకోన్‌ను సెప్టెంబర్ 25న, శ్రద్దా కపూర్, సారా ఆలీ ఖాన్‌ను సెప్టెంబర్ 26వ తేదీన విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. ఈ సమన్లతో బాలీవుడ్ సినీ పరిశ్రమ మరోసారి ఉలిక్కిపాటుకు గురైంది.

Next Story