నిర్భయ నిందితులకు ఇదే ఆఖరి రోజా..?

By Newsmeter.Network  Published on  17 Dec 2019 3:48 AM GMT
నిర్భయ నిందితులకు ఇదే ఆఖరి రోజా..?

ఢిల్లీ: ఇవాళ సుప్రీంకోర్టులో నిర్భయ నిందితుడి రివ్యూ పిటిషన్‌పై విచారణ జరగనుంది. 2017 మే 5న సుప్రీంకోర్టు విధించిన ఉరిశిక్షను పునః సమీక్షించాలని సుప్రీంకోర్టును నిందితుడు అక్షయ్‌ సింగ్‌ ఆశ్రయించాడు. మరోవైపు దోషులకు శిక్ష అమలులో ఆలస్యంపై నిర్భయ తల్లి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం విచారించనుంది.

2012, డిసెంబర్‌ 16న ఓ విద్యార్థిపై కదులుతున్నబస్సులు ఆరుగురు నీచులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను, ఆమె స్నేహితుడిని రోడ్డుపై విసిరేసి పరారయ్యారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను సింగపూర్‌ లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా, చివరకు కన్నుమూసింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెకు నిర్భయగా నామకరణం చేశారు. ఈ ఘటనలో నిందితులైన, వినయ్‌, రామ్‌ సింగ్‌, అక్షయ్‌కుమార్‌, పవన్‌, ముఖేష్‌, మరో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని తీహార్‌ జైలుకు తరలించగా, 2013లో ఓ నిందితుడు జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో నిందితుడు మైనర్‌గా భావించి మూడు సంతవ్సరాలపాటుజైలు శిక్ష విధించి విడుదల చేశారు. కేసు విచారించిన కోర్టు, కాగా మిగిలిన నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించింది. కాగా, ఈ తీర్పును సవాల్‌ చేస్తూ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి 2017 మే 5న హైకోర్టు విధించిన ఉరి శిక్షనే సమర్ధించింది. చివరి ప్రయత్నంగా నిందితులు రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ అటువంటి మృగాళ్లను కనికరించవద్దని ఢిల్లీ ప్రభుత్వం ప్రెసిడెంట్‌ను అభ్యర్థించింది. దీంతో రాష్ట్రపతి కోవింద్ కూడా క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడంతో ఉరిశిక్ష ఖరారు అయినట్లు తెలుస్తోంది. కానీ.. ఇంతవరకూ దానిపై క్లారిటీ రాలేదు. నిర్భయ తల్లిదండ్రులు ఈ ఘటనపై ఏడేళ్లు పోరాటం చేస్తున్నా.. తమకు న్యాయం ఇంత వరకు జరగలేదని ఆవేదన వెళ్లబోసుకుంటున్నారు.

Next Story