విశాఖ: నేడు భారత నౌకాదళ దినోత్సవం. ఇవాళ దేశ ప్రజలంతా నేవీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశ రక్షణ కోసం నేవీ సైనికులు చేసిన సేవలను, త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారు. డిసెంబర్‌ 4కు చరిత్రలో ఏంతో ప్రత్యేక స్థానముంది. చిరకాల శత్రుదేశం పాక్‌పై భారత్‌ అపూర్వ విజయం సాధించిన రోజు ఇది. 1971 సంవత్సరంలో భారత్‌-పాకిస్తాన్‌ యుద్ధంలో పాక్‌ నావికా స్థావరాలను.. మన దేశ నేవీ సైనికులు ధ్వంసం చేశారు. పాక్‌కు చెందిన నాలుగు యుద్ధ నౌకలను భారత్‌ నేవీ సైనికులు కుప్ప కూల్చారు.

ఆపరేషన్‌ ట్రైడెంట్‌లో భాగం మొట్టమెదటిసారిగా యాంటి షిప్‌ మిసైల్‌ను ప్రయోగించారు. బంగ్లాదేశ్‌ స్వతంత్ర పొందడంలో కూడా ఈ రోజు మెయిన్‌ రోల్‌ పోషించింది. డిసెంబర్‌ 4న మన దేశ నావీకులు పాక్‌కు చెందిన కరాచీ నేవీ హార్బర్‌ నాశనం చేశారు. యుద్ధం ట్యాంకులను ధ్వంసంలో పలువురు పాక్‌ నేవీ అధికారులు చనీపోయారు. అయితే ఈ యుద్ధంలో భారత్‌కు చెందిన ఒక్క నేవీ సైనికుడు కూడా చనిపోకపోవడం గమనార్హం. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత నేవీ శక్తిమంతమైనది కూడా. దేశ రక్షణ కోసం ఎంతో నేవీ సైనికులు అహర్నిశలు సముద్రంలో గడుపుతున్నారు. సరిహద్దులో నేవీ సైనికులు ప్రతిరోజు అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. దాయాది దేశంపై గెలిచిన రోజును గుర్తు చేసుకుంటూ డిసెంబర్‌ 4న మనం నేవీ దినోత్సవం జరుపుకుంటున్నాము.

విశాఖలో నేవీ విన్యాసాలు..

నేవీ దినోత్సవం సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు. ఆర్కే బీచ్‌లో విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ నౌకలతో నేవీ సిబ్బంది విన్యాసాలు చేయనున్నారు. ఈ విన్యాసాలను సీఎం జగన్‌ తిలకించనున్నారు. ఈఎన్‌సీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌ ఆహ్వానం మేరకు సీఎం జగన్‌ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్‌ విశాఖపట్నం బయల్దేరనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు సీఎం జగన్‌ నేవీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం 7.30 గంటలకు విశాఖ ఎయిర్‌ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సీఎం జగన్‌ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.