బ్రేకింగ్‌: ఘోర విమాన ప్ర‌మాదం... 19 మంది మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Nov 2019 1:41 PM GMT
బ్రేకింగ్‌: ఘోర విమాన ప్ర‌మాదం... 19 మంది మృతి

ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. గోమా నుంచి బెనీ వెళ్తున్న‌ డోర్నియర్ విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఒక్క‌సారిగా కుప్పకూలిపోయింది. సాంకేతిక లోపంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. టేకాఫ్ స‌మ‌యంలో విమానం అదుపుతప్పి జనావాసాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు సిబ్బంది, 17 మంది ప్రయాణికులు మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న అధికారులు ఇప్పటి వరకు ఆరుగురి మృత‌దేహాల‌ను గుర్తించారు. ప్రస్తుతం సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story