నేపాల్ లో లోయలో పడిన బస్సు, మృతులు 18 మంది

By అంజి  Published on  28 Nov 2019 7:04 AM GMT
నేపాల్ లో లోయలో పడిన బస్సు, మృతులు 18 మంది

నేపాల్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. లోయలో బస్సు పడిన సంఘటనలో 18 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. అర్ఘాఖాంచీ జిల్లా నుంచి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ 500 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది. సంధికాక్ నుంచి భూటాన్ వెళ్తున్న బస్సు బుధవారం నాడు నార్పానీ ప్రాంతంలో అదుపు తప్పి లోయలో పడింది. మూల మలుపు తిరిగే సమయంలో డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు నేపాల్ పోలీసులు చెబుతున్నారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని హాస్పటల్స్ కు తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

5dde8f5b867d0

Next Story