హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ‘స్పెక్ట్రమ్’ ఫెస్ట్ ఆద్యంతం ఉర్రూతలూగించడానికి సిద్ధం అయింది. ఫ్యాషన్, ఫన్ తో కూడుకున్న ఈ ఫెస్ట్ కోసం యువత సిద్ధమైంది.

రెండు రోజుల పాటూ సాగే ఈ షోలో మొదటి రోజు స్టాండ్-అప్ కమెడియన్ ‘అభిశ్ మాథ్యూ’ నవ్వులు పూయించారు. ఈ ఫెస్ట్ ను విజయవంతం చేయడానికి విద్యార్థులంతా కలిసికట్టుగా చాలా కష్టపడ్డారని థర్డ్ ఇయర్ స్టూడెంట్ సౌరభ్ తెలిపాడు. అభిశ్ మాథ్యూ షో నవ్వులు పూయించిందని.. ముఖ్యంగా నిఫ్ట్ గురించి అతడు బాగా రీసర్చ్ చేసుకొని వచ్చి మరీ వేసిన జోక్స్ అందరినీ ఆకట్టుకున్నాయని అన్నాడు. కాలేజీ క్యాంపస్ లో మా లైఫ్ ఎలా సాగుతోందో అతడు కళ్ళకు కట్టినట్లు చెప్పాడని మిగిలిన విద్యార్థులు అన్నారు. కల్చరల్ ఈవెంట్స్ మాత్రమే కాకుండా చాలా ఈవెంట్స్ ను కూడా ఆర్గనైజ్ చేశారు విద్యార్థులు. మిగిలిన కాలేజీలకు చెందిన స్టూడెంట్స్ కూడా ఇందులో పాల్గొన్నారు. స్టాల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు కావాల్సినవి కొనుక్కునేలా చేశారు. నిఫ్ట్ కాలేజీ స్టూడెంట్స్ కూడా ప్రత్యేకంగా ‘కలిస్టా’ స్టాల్ ను ఏర్పాటు చేశారు. వారు సొంతంగా తయారు చేసిన బట్టలను, వస్తువులను అక్కడ అమ్మడం విశేషం. ఫెస్ట్ మొదటి రోజు అద్భుతంగా పూర్తవ్వగా.. రెండో రోజు కోసం కూడా విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా నిఫ్ట్ కే పేరు తీసుకొని వచ్చే ‘ఫ్యాషన్ షో’ కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.