వన్య ప్రాణులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేషనల్ జియోగ్రాఫిక్ సంస్థ అందరికీ అందిస్తూ ఉంటుంది. ఆ ఛానల్ లో వివిధ రకాల వీడియోలు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు. చూసే వాళ్లు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ సంస్థకు మ్యాగజైన్ కూడా ఉంది. తాజాగా ఓ వీడియోను నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ఒక మిలియన్ అమెరికన్ డాలర్లు ఇచ్చి తీసుకుందంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ షార్క్ అమాంతం ఎగిరి హెలీకాప్టర్ ను అందుకుంది.


“National geographic channel has paid 1 Million Dollar for this rare video..What a video” అంటూ వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ఒక మిలియన్ డాలర్ ఇచ్చి కొనుక్కుంది.. ఎంతో అరుదైన వీడియో అని చెబుతూ ఉన్నారు.

http://archive.vn/Z3zzm

యూట్యూబ్ లో కూడా ఈ వీడియోను షేర్ చేశారు.

నిజ నిర్ధారణ:

వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అది ‘5 headed shark’ అని ఉన్న సినిమాకు సంబంధించిన వీడియో అని తెలుస్తోంది. ఆ  ఇంగ్లీష్ సినిమా 2017లో విడుదలైంది. వైరల్ అవుతున్న ఆ వీడియోకు సంబంధించిన క్లిప్ ఈ సినిమా ట్రైలర్ లో ఉంచారు. ఈ ట్రైలర్ లో ఉన్న ఓ క్లిప్ వైరల్ అవుతోంది.

నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ తమ పాలసీలో భాగంగా ఎటువంటి వీడియోలను కొనుక్కోమని చెప్పింది. నేషనల్ జియో గ్రాఫిక్ ఛానల్ ఇచ్చిన సమాధానం ప్రకారం తమ మేగజైన్, వెబ్ సైట్ పబ్లికేషన్ కోసం ఎవరి దగ్గర నుండి వీడియోలను  తీసుకోమని తెలిపారు. ముందుగానే ప్లాన్ చేసుకున్న విధంగా ఆర్టికల్స్ ను పబ్లిష్ చేస్తామని.. కొన్ని సంవత్సరాలకు తగ్గట్టుగా అసైన్మెంట్స్ ఇస్తామని, అందుకు తగ్గట్టుగా కవరేజ్ ఇస్తారని తెలిపారు.

“Your Shot” ద్వారా వేరే వాళ్లకు అవకాశం ఇస్తామని చెబుతోంది. మంచి ఫోటోలు వంటివి తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం ద్వారా నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కు నచ్చితే సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేయడానికి వీలవుతుంది.  @NatGeoYourShot అనే ఇంస్టాగ్రామ్ పేజీలో ఫోటోలు పోస్టు చేస్తూ ఉంటారు. #YourShotPhotographer అంటూ ట్యాగ్ ను వాడడం ద్వారా ప్రకృతికి సంబంధించిన  ఫోటోలు, వీడియోలను  నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయబడుతుంది. నేషనల్ జియోగ్రాఫిక్ సంస్థ ప్రతినిధులకు అద్భుతంగా అనిపించిన ఎంతో మంది ఫోటోలను షేర్ చేయడం జరిగింది.

2017లో కూడా ఓ సుడిగాలికి సంబంధించిన వీడియోకు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ఒక మిలియన్ డాలర్లు ఇచ్చింది అని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ వైరల్ వార్త మీద Snopes ఫ్యాక్ట్ చెక్ చేయగా.. అది 2014లో వచ్చిన సినిమా ‘ఇన్ టు ద స్టార్మ్’ (Into the Storm) సినిమాకు చెందిన క్లిప్ అని తేల్చేశారు.

షార్క్ వీడియోను నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ఒక మిలియన్ డాలర్లు ఇచ్చి కొనుక్కుందన్నది పచ్చి అబద్ధం.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort