ఈ మధ్యన దేశంలో ఏదో ఒక చోటు భూకంపం సంభవిస్తోంది. పెద్దగా నష్టాలేమి లేకున్నా.. అక్కడక్కడ భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. ఇక తాజాగా కర్ణాటకలోని హంపీలో, జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌ కేంద్రంగా భూకంపం సంభవించింది.

హంపీలో భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.0గా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఇక జంషెడ్‌ పూర్‌ నగరంలో శుక్రవారం ఉదయం సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.7గా నమోదైంది. ఈ భూప్రకంనలతో హంపీ, జంషేడ్‌ పూర్ ప్రాంతాల్ఓల ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తినష్టం గానీ జరగేలదని అధికారులు తెలిపారు. ఈ భూప్రకంపనలు సంభవించగానే ప్రజలు భయాందోళనలతో ఇళ్లనుంచి పరుగులు తీశారు.

మరో వైపు ఏపీలోని ప్రకాశం జిల్లాలోనూ స్వల్పంగా భూమి కంపించింది. ఒంగోలులో రెండు సెకన్లపాటు భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.