మహారాష్ట్రలో జికా వైరల్ కలవరం.. ఇద్దరు గర్భిణులకు పాజిటివ్
మహారాష్ట్రలో జికా వైరస్ కలవరం సృష్టిస్తోంది.
By Srikanth Gundamalla Published on 2 July 2024 12:30 PM ISTమహారాష్ట్రలో జికా వైరల్ కలవరం.. ఇద్దరు గర్భిణులకు పాజిటివ్
మహారాష్ట్రలో జికా వైరస్ కలవరం సృష్టిస్తోంది. పుణెలో ఆరుగురికి ఈ వైరస్ సోకినట్లు తెలిసింది. ఇందులో ఇద్దరు గర్భిణి మహిళలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఎరంద్‌వానే ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల గర్భిణీకి జికా వైరస్ సోకినట్లు గుర్తించారు. ఆమె నిర్వహించిన వైద్య పరీక్షల్లో జికా వైరస్ పాజిటివ్ అని తేలింది. మరో 12 వారాల గర్భిణి మహిళకు కూడా ఈ వైరస్ ఇన్‌ఫెక్షన్ సోకినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇద్దరు మహిళల పరిస్థితి బాగానే ఉందనీ.. నిత్యం వారి ఆరోగ్య పరీక్షిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ వైరస్ గురించి వైద్యులు ఆసక్తికర విషయాలను పచుకున్నారు. గర్భిణిలకు సోకితే పుట్టే బిడ్డల్లో మెదడు అభివృద్ధి ఉండదని చెప్పారు. జికా వైరస్ వ్యాధి సోకిన ఆడ ఏడెస్ దోమ కాటు ద్వారా ఇది వ్యాపిస్తుందని చెప్పారు. జ్వరం, దద్దర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు వెల్లడించారు. ఇది డెంగ్యూ, చికున్‌గున్యా వంటి ఇన్‌ఫెక్షన్లను కూడా వ్యాపిస్తుంది.మొదట ఈ జికా వైరస్‌ను 1947లో ఉగాండాలో గుర్తించారు. తర్వాత ఆఫ్రికన్ దేశాలతో పాటు భారత్, ఇండోనేషిఆ, మలేషియా ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం వంటి ఆసియా దేశాలకు జికా వైరస్ వ్యాపి చెందింది.
ఫాగింగ్, ఫ్యూమిగేషన్ వంటి దోమల వృద్ధిని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు పుణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారి తెలిపారు. పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగం నిఘా నిర్వహిస్తోంది. ముందుజాగ్రత్త చర్యగా దోమల వృద్ధిని అరికట్టేందుకు ఫాగింగ్, ఫ్యూమిగేషన్ వంటి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జికా వైరస్ లక్షణాలు ఉన్నాయని అనిపిస్తే ఆస్పత్రులకు వెళ్లి టెస్టులు చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.