YS Sharmila: కేసీఆర్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. ఢిల్లీలో వైఎస్‌ షర్మిల అరెస్ట్‌

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ.. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతృత్వంలోని కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా

By అంజి  Published on  14 March 2023 9:00 AM GMT
YS Sharmila , Delhi Police

ఢిల్లీలో వైఎస్‌ షర్మిల అరెస్ట్‌

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ.. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతృత్వంలోని కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం ఉదయం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా పార్లమెంట్‌కు బయల్దేరారు. 'కేసీఆర్ డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు. అయితే ఢిల్లీ పోలీసులు ఆమెను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ''కాళేశ్వరం ప్రాజెక్టు అది పెద్ద స్కామ్‌. అది ప్రజల సొమ్ము. అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆ ప్రాజెక్టుకు రుణాలు ఇచ్చాయి. దీని మీద విచారణ చేపట్టాలి'' అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్‌ఐ షేర్ చేసిన విజువల్స్‌లో.. ఫోటోగ్రాఫర్‌ల గుంపు మధ్యలో ఉన్న వైఎస్‌ షర్మిళను మహిళా పోలీసు సిబ్బంది గుర్తు తెలియని తెల్లటి వాహనంలోకి ఎక్కించగా, ఆమె తన అనుచరులతో కలిసి ''కేసీఆర్ డౌన్, డౌన్'' అని నినాదాలు చేశారు. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్టు అయిన దక్షిణాది రాష్ట్రానికి చెందిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అవకతవకలను ఎత్తిచూపడానికి షర్మిల మంగళవారం జంతర్ మంతర్ నుండి పార్లమెంటు వరకు 'శాంతియుత పాదయాత్ర' నిర్వహించాలని అనుకున్నారు.


Next Story