అందరూ చూస్తుండగానే మేనత్తను చితకబాదాడు
Young man publicly thrashed aunt.సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో
By M.S.R Published on 2 Jan 2022 1:10 PM ISTసోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో ఒక వ్యక్తి తన అత్తను కర్రతో కొడుతున్న వీడియో అది. అతడి చేతుల్లో గాయపడిన అత్త పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరింది. ఇది కుటుంబ సంబంధమైన అంశమని, పండిన పంట నష్టపోవడంతో గొడవ జరిగిందని చెబుతున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం కాస్తా కొట్టుకునే దాకా వెళ్ళింది. కోపోద్రిక్తుడైన అతడు అత్తను కర్రలతో కొట్టాడు.
ఈ ఘటన ధోల్‌పూర్ జిల్లాలోని రాజఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వైరల్ వీడియో ఆధారంగా ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. బాధితురాలు పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రిలోని ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతోంది. నిందితులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గాయపడిన వారికి వైద్య చికిత్స అందించిన తర్వాత ఒకరిని అరెస్టు చేశామని.. ఇంకొకరి కోసం వెతకడం ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
హరి ఓమ్ అనే వ్యక్తి తన అత్త పూనియా, మామ సజ్జన్ సింగ్‌తో గొడవ పడడం వీడియోలో చూడవచ్చు. చేతిలో దుంగతో చితక్కొట్టాడు. ఆవాల పొలంకు సంబంధించిన గొడవ కారణంగా ఈ మొత్తం ఘటన చోటు చేసుకుంది. అత్త కూడా చేతిలో కొడవలితో అరవడం మొదలుపెట్టింది. తన అత్తపై కర్రతో దాడి చేయడంతో ఆమె గాయపడి నేలపై పడిపోయింది. ఈ కేసులో బాధిత మహిళ తనను కర్రలతో కొట్టినట్లు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టినట్లు విచారణ అధికారి కృష్ణమురారి తెలిపారు. నిందితుడు హరిఓమ్‌ను అరెస్టు చేసిన అనంతరం కేసు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో పాటు వైరల్ అవుతున్న వీడియోపై విచారణ కూడా జరుగుతోంది.