బ‌ల‌వంతంగా వివాహం చేస్తున్నార‌ని.. పురుషాంగాన్ని కోసుకున్నాడు

Young man cuts his penis in Tamil nadu.ఇటీవ‌ల కాలంలో యువ‌త చిన్న విష‌యాల‌కే అతిగా ఆలోచిస్తున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jun 2021 1:07 PM IST
బ‌ల‌వంతంగా వివాహం చేస్తున్నార‌ని..  పురుషాంగాన్ని కోసుకున్నాడు

ఇటీవ‌ల కాలంలో యువ‌త చిన్న విష‌యాల‌కే అతిగా ఆలోచిస్తున్నారు. ఇక వివాహాం విష‌యంలో ఎవ్వ‌రూ కూడా తీసుకోని నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. తమ మనసులోని వేదనను క‌న్న‌వారితో చెప్పుకోలేక క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నార‌ని చెన్నైలోని ఓ యువ‌కుడు చేసిన పని ఇప్పుడు అంద‌రిని షాక్‌కు గురిచేస్తోంది.

వివ‌రాల్లోకి వెళితే.. చెన్నైలోని గాంధీనగర్‌లో మురుగన్ త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. అత‌డి కుమారుడు విజయరాఘవన్‌(23) కు పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. విజ‌య రాఘ‌వ‌న్ త‌న‌కు మ‌రో రెండేళ్ల వ‌రుకు పెళ్లి ఇష్టం లేద‌ని కుటుంబ సభ్యుల‌కు చెప్పాడు. అయితే.. అత‌డు చెప్పిన మాట‌ల‌ను కుటుంబ స‌భ్యులు వినిపించుకోలేదు. ఓ యువ‌తితో వ‌చ్చేవారం అత‌డికి నిశ్చితార్థం ఏర్పాటు చేశారు.

తాను పెళ్లి వ‌ద్ద‌న్నా కూడా పెద్ద‌లు యువ‌తితో నిశ్చితార్థానికి ఏర్పాటు చేయ‌డంతో అత‌డు దారుణ‌మైన నిర్ణ‌యం తీసుకున్నాడు. ఉలి సాయంతో త‌న పురుషాంగాన్ని కోసుకున్నాడు. ఈ క్ర‌మంలో ఉలి అత‌డి గొంతుకు త‌గ‌ల‌డంతో అక్క‌డ తీవ్ర గాయ‌మైంది. ఇక తను పెళ్లికి పనికిరానంటూ కేకలేశాడు. గ‌మ‌నించిన త‌ల్లిదండ్రులు వెంట‌నే అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

Next Story