సెల్‌ఫోన్ వాడొద్దన్నందకు జలపాతంలో దూకిన యువతి.. చివరకు..

సెల్‌ఫోన్‌ ఎక్కువ మాట్లాడొద్దని తల్లిదండ్రులు చెప్పడంతో ఓ యువతి జలపాతంలో దూకింది.

By Srikanth Gundamalla  Published on  19 July 2023 9:45 PM IST
Young Girl, Jump waterfall, Chhattisgarh,

 సెల్‌ఫోన్ వాడొద్దన్నందకు జలపాతంలో దూకిన యువతి.. చివరకు..

సెల్‌ఫోన్‌ వినియోగం బాగా పెరిగిపోయింది. సెల్‌ఫోన్‌ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితులు. పెద్దలే కాదు.. చిన్నపిల్లలు కూడా సెల్‌ఫోన్‌కు బానిసలుగా మారారు. సెల్‌ఫోన్‌ ఇప్పించట్లేదని.. ఎక్కువగా వాడొద్దని తల్లిదండ్రులు చెప్పిన సంఘటనల్లో చిన్నారులు అనూహ్యనిర్ణయాలు తీసుకున్నారు. కొందరైతే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలోనే సెల్‌ఫోన్‌ ఎక్కువ మాట్లాడొద్దని తల్లిదండ్రులు చెప్పడంతో ఓ యువతి జలపాతంలో దూకింది. చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తల్లిదండ్రుల మాటలను ఇప్పుడున్న పిల్లలు అస్సలు లెక్కచేయడం లేదు. వారికి నచ్చినపని చేయనివ్వకుంటే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడటం లేదు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో ఫోన్‌ వాడొద్దని తల్లిదండ్రులు గట్టిగా చెప్పడంతో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చిత్రకోట్‌ జలపాతం వద్దకు వెళ్లారు ఓ కుటుంబ సభ్యులు. అప్పటిపకే అమ్మాయి ఊరికే ఫోన్‌ మాట్లాడుతుంది. గమనించిన తల్లిదండ్రులు అలా పదేపదే ఫోన్‌ మాట్లాడి.. దానికి అడిక్ట్‌ కావొద్దని మందలించారు. దాంతో ఆగ్రహానికి గురైన యువతి అనూహ్య నిర్ణయం తీసుకుంది. నేను చనిపోతానంటూ జలపాతం వైపు వెళ్లింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జలపాతంలో వరద ప్రవాహం ఉదృతంగా ఉంది. అలా అక్కడే నిల్చుని కాసేపు అటూఇటూ చూసిన బాలిక ఉన్నట్లుండి జలపాతంలో దూకేసింది. అక్కడున్నవారు అరుస్తూ వద్దని ఎంత చెప్పినా వినకుండా నీళ్లలో దూకేసింది.

వరద ప్రవాహంలోనే కాసేపటి తర్వాత కొట్టుకు వచ్చి ఒడ్డుకు చేరింది సుదురు యువతి. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు ఆమెను బయటకు తీశారు. భారీ వరద ప్రవాహం నుంచి కూడా ప్రాణాలతో బయటపడటంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత బాలికను పోలీసులు ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు చిన్న విషయాలకే ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఇక పెద్దలు కూడా పిల్లలకు వినేలా నచ్చజెప్పాలి.. ఒత్తిడి తీసుకురాకూడదంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story