మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త.. రాఖీ సంద‌ర్భంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం

Yogi govt announces free bus travel for women.రక్షాబంధన్ సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌కు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం శుభ‌వార్త

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Aug 2021 5:50 AM GMT
మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త.. రాఖీ సంద‌ర్భంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం

రక్షాబంధన్ సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌కు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. మ‌హిళ‌లు ఏ బ‌స్సులోనైనా, ఎప్పుడైన ఉచితంగా ప్ర‌యాణం చేయొచ్చున‌ని యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌క‌టించారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్ట్ 21 అర్ధరాత్రి నుంచి ఆగస్ట్‌ 22 అర్ధరాత్రి 12 గంటల వరకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. మహిళలు అన్ని రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని యూపీఎస్ఆర్‌టీసీ తెలిపింది.

గత సంవత్సరం కూడా దాదాపు 3.5 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక పింక్ టాయిలెట్ల నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని దాదాపు 1300 పోలీస్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో మహిళా పోలీసుల నియామకం కూడా చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ద‌మ‌వుతోంది. మిషన్ శక్తి మూడవ దశ కింద రక్షాబంధన్ పండుగకు ఒక రోజు ముందు సీఎం యోగి ఆదిత్యనాథ్ మహిళా పోలీసులను బీట్ పోలీస్ ఆఫీసర్లుగా పోస్ట్ చేసే బహుమతిని కూడా ఇవ్వనున్నారు.

Next Story
Share it