ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కరోనా

Yogi Adityanath Tested For Covid Positive. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది.

By Medi Samrat
Published on : 14 April 2021 3:11 PM IST

Yogi Adityanath

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. సీఎం కార్యాల‌య అధికారుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో మంగ‌ళ‌వారం నాడు ఐసోలేషన్ లోకి వెళ్లిన ఆయన.. నేడు తనకూ కరోనా పాజిటివ్ వచ్చిందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

కరోనా లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకున్నానని, అందులో పాజిటివ్ గా తేలిందని ఆయన చెప్పారు. డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. ఇదిలావుంటే.. సీఎం ఓఎస్డీ అభిషేక్ కౌషిక్ సహా కొందరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఐసోలేషన్ లోకి వెళ్లిన యోగి వెంటనే టెస్టులు చేయించుకున్నారు. తనకు కరోనా సోకినా ఇంటి నుంచి అన్ని పనులు చేస్తానని, వర్చువల్ గా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమీక్ష సమావేశాలు నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు.




Next Story