మందుబాబుల‌కు షాక్‌.. ఇంట్లో మ‌ద్యం నిల్వ‌చేసుకోవాలంటే లైసెన్స్ త‌ప్ప‌నిస‌రి

Yogi Adityanath government in up puts cap on liquor storage at homes.ఒకేసారి ఇంట్లో ఎక్కువ మ‌ద్యం నిల్వ చేసుకునే వారికి షాక్. ఇంట్లో మ‌ద్యం నిల్వ‌చేసుకోవాలంటే లైసెన్స్ త‌ప్ప‌నిస‌రి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jan 2021 8:18 AM GMT
liquor storage at homes

ఒకేసారి ఇంట్లో ఎక్కువ మ‌ద్యం నిల్వ చేసుకునే వారికి ప్ర‌భుత్వం షాకింగ్ విష‌యం చెప్పింది. ఇక‌పై ఎక్కువ మొత్తంలో మ‌ద్యం నిల్వ చేసుకోవాలంటే త‌ప్ప‌నిస‌రిగా లైసెన్స్ తీసుకోవాల‌ని సూచించింది. ప‌రిమితి దాటితే మందు కొనాల‌న్నా, ర‌వాణా చేయాల‌న్నా.. ఇంట్లో పెట్టుకోవాల‌న్నా లైసెన్స్ ఉండాల‌న్న‌ది ఈ కొత్త నిబంధ‌న సారాంశం. అయితే.. ఇది మ‌న ద‌గ్గ‌ర కాదులెండి.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో.

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం ఈ కొత్త రూల్ తీసుకొచ్చింది. దీని ప్ర‌కారం ఒక వ్య‌క్తి లేదా ఒక ఇంట్లో గ‌రిష్ఠంగా ఆరు లీట‌ర్ల కంటే ఎక్కువ మ‌ద్యం ఉండ‌కూడ‌దు. అంత‌కంటే.. ఎక్కువ నిల్వ చేసుకోవాలంటే లైసెన్స్ త‌ప్ప‌ని స‌రి. ఈ లైసెన్స్ ఫీజు ఏడాదికి రూ.12 వేలుగా ఉంటుంది. రూ.51 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. రిటైలర్స్ కు లైసెన్స్ ఫీజును 7.5 శాతం పెంచింది. గ‌‌తేడాది కంటే ఈ ఏడాది ఎక్సైజ్ ఆదాయాన్ని రూ.6 వేల కోట్లు పెంచాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది.


Next Story