ఎల్లో ఫంగస్.. ఎందుకు డేంజర్ అంటే..
Yellow fungus. తాజాగా ఎల్లో ఫంగస్ తెరమీదకొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో తొలి ఎల్లో ఫంగస్ కేసు నమోదు అయింది.
By Medi Samrat
కరోనాతో ఉన్న సమస్యలు చాలవన్నట్టు కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే జనం బ్లాక్, వైట్ ఫంగస్‌లతో సతమతమవుతుంటే తాజాగా ఎల్లో ఫంగస్ తెరమీదకొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో తొలి ఎల్లో ఫంగస్ కేసు నమోదు అయింది. ఇది బ్లాక్, వైట్ ఫంగస్‌ల కంటే కూడా ఎక్కువ ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.
ఎల్లో ఫంగస్ బారిన పడిన తొలి వ్యక్తి ప్రస్తుతం ప్రముఖ ఈఎన్‌టీ డాక్టర్ బ్రిజ్ పాల్ త్యాగి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. నీరసం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం తదితర లక్షణాలు ఎల్లో ఫంగస్ వ్యాధి ఉన్నవారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయని వైద్యులు గుర్తించారు. అంతేకాదు ఇది ఎక్కువగా ఉంటే శరీరం లోని కొన్ని భాగాల నుంచి చీము బయటకు వస్తుంది, ఎల్లో ఫంగస్ శరీరం లో ఉన్న వారికి తగిలిన ఎలాంటి గాయం అయినా త్వరగా నయం కాదు. లక్షణాలు చాలా చిన్నవే అయినప్పటికీ ఇది ప్రాణాంతక వ్యాధి అని, వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఎల్లో ఫంగస్ కళ్ళపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఫంగస్ తీవ్రత అధికంగా ఉన్నవారు చూపులు కోల్పోవచ్చు. అలాగే వివిధ అవయవాలు కూడా పనిచేయడం ఆగిపోయి వికలాంగులు కావచ్చు ఈ వైరస్ శరీరంలోని ఏ భాగాన్నయినా పాడు చెయగల శక్తి కలది.
అయితే పరిశుభ్రత లేకపోవడం వల్ల ఈ సంఘ శరీరంలో గూడు కట్టుకుంటుంది అని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇది శరీరం లోపలి భాగాల్లో కనపడని గాయాలను కలిగిస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచింస్తున్నారు.