వీధికుక్కలకు ఆహారం పెట్టిందని.. మహిళ ప్రైవేట్ భాగాలపై దాడి
గురుగ్రామ్‌లోని సైబర్ సిటీలో వీధి కుక్కలకు ఆహారం ఇచ్చిన ఓ మహిళపై దాడి జరిగింది.
By అంజి Published on 12 March 2023 6:00 PM ISTవీధికుక్కలకు ఆహారం పెట్టిందని.. మహిళ ప్రైవేట్ భాగాలపై దాడి
గురుగ్రామ్‌లోని సైబర్ సిటీలో వీధి కుక్కలకు ఆహారం ఇచ్చిన ఓ మహిళపై దాడి జరిగింది. సదరు మహిళను పక్కింటి వ్యక్తి.. రోడ్డుపై వెంబడించి కొట్టాడు. ఈ క్రమంలో మహిళకు తీవ్ర గాయాలు కాగా.. ఆమె శరీరం మొత్తం గాయాల ఆనవాళ్లు ఉన్నాయి. తాను పోలీసులను ఆశ్రయించగా, అందుకు విరుద్ధంగా పోలీసులు తనను తిట్టడం ప్రారంభించారని మహిళ ఆరోపించింది. నిందితుడు పొరుగువాడు పోలీసుల సమక్షంలోనే తనపై ఉమ్మివేసాడని మహిళ చెప్పింది. పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో బాధిత మహిళ పీపుల్ ఫర్ యానిమల్స్ అధినేత మేనకా గాంధీకి ఫిర్యాదు చేయగా, పోలీసులు రంగంలోకి దిగి బాధిత మహిళను వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
బాధితురాలు మారుతి విహార్ ప్రాంతంలో దాదాపు ఒక సంవత్సరం పాటు నివసిస్తోంది. ఆమెకు వీధికుక్కలకు ఆహారం ఇచ్చే అలవాటు ఉంది. శనివారం రాత్రి వీధికుక్కలకు ఆహారం ఇస్తుండగా, చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులు తనను అలా చేయకుండా అడ్డుకున్నారని బాధితురాలు తెలిపింది. ఇరుగుపొరుగు కుటుంబం వీధికుక్కలను కర్రలతో కొట్టడం ప్రారంభించిందని మహిళ చెప్పింది. ఆమె నిరసన వ్యక్తం చేయడంతో నిందితుడి కుటుంబం ఆమెతో గొడవకు దిగింది. నిందితులు తన ప్రైవేట్ భాగాలపై మాత్రమే దాడి చేశారని మహిళ ఆరోపించింది. దీంతో ఆమె రక్తస్రావం కూడా అయింది.
మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. దాడి ఘటనపై పోలీసులకు సమాచారం అందించింది. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెకి సహాయం చేయలేదు. అయితే నిందితుల కుటుంబసభ్యుల ఎదుటే తనను బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో నిందితుల్లో ధైర్యం పెరిగి నిందితుల్లో ఒకరు పోలీసుల ఎదుటే తన ముఖంపై ఉమ్మి వేశారని తెలిపింది. పోలీసుల సహాయం అందకపోవడంతో పీపుల్ ఫర్ యానిమల్స్ అధినేత మేనకా గాంధీని ఆశ్రయించానని బాధితురాలు తెలిపింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అతనికి వైద్యం అందించారు. బాధిత మహిళతో సంభాషణ కొనసాగుతోందని సంస్థ సభ్యుడు కమల్‌జిత్ చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజీకి రావాలని నిందితులు తనపై ఒత్తిడి తెస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. రాజకీయ ఒత్తిళ్లు సృష్టిస్తున్నారని, అలాగే కేసు పెడితే ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి యజమానిపై ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది.