అర్ధరాత్రి.. ఖాళీ రోడ్డు మీద యువతి డాన్స్.. తరువాత..?

Woman shoots dance video during curfew.కరోనా మహమ్మారిని తప్పించుకు తిరుగుదామని ఎంత ప్రయత్నించినా ఫలితం కనబటం లేదన్నది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 April 2021 3:51 AM GMT
అర్ధరాత్రి.. ఖాళీ రోడ్డు మీద యువతి డాన్స్.. తరువాత..?

కరోనా మహమ్మారిని తప్పించుకు తిరుగుదామని ఎంత ప్రయత్నించినా ఫలితం కనబటం లేదన్నది అందరికీ తెలిసినదే.. ప్రపంచం నలుమూలలా కరోనా ప్రమాద ఘంటికలను మోగిస్తున్న వేళ, కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ప్రజలపై క్రమంగా నిబంధనలు, ఆంక్షలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ కు చెందిన ఓ యువతి, రోడ్డు ఖాళీగా ఉండి కదా అని రెచ్చిపోయింది. కర్ఫ్యూ సమయంలో నడిరోడ్డుపై డ్యాన్స్ చేసి చిక్కుల్లో పడింది. ఈ వీడియో కారణంగా, ఆమె ఇప్పుడు పోలీసు కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది.

రాజ్ కోట్కు చెందిన ప్రిషా రాథోడ్ అనే యువతి ఈవెంట్ మేనేజర్. సోషల్ మీడియాలో తన వీడియోలు పోస్ట్ చేస్తూ, పేరు తెచ్చుకుంది. ఆమెకు బాగా ఫాలోవర్స్ ఉన్నారు. వారికోసం తానో వీడియోను మరింత వినూత్నంగా చేయాలని భావించిన ఆమె.. రాత్రి 11 గంటల సమయంలో మాస్క్ ధరించి ఓ ఇంగ్లీష్ పాటకు నడిరోడ్డుపై డ్యాన్స్ చేస్తూ వీడియోను రికార్డ్ చేయించింది. దీనిని తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో ఏప్రిల్ 12న అర్ధరాత్రి పోస్ట్ చేసింది.

ఆ పోస్ట్ కు ఆమె ఫాలోవర్స్ ఆనందించి వీడియోను వైరల్ చేశారు. మరికొంతమంది మాత్రం ఆమె నిబంధనలను ఉల్లంఘించిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు పెట్టారు. అయితే, తాను ఆ వీడియోను డిలీట్ చేశానని, అప్పటికే పలువురు దాన్ని షేర్ చేయడంతోనే అది వైరల్ అయిందని ఆమె వివరణ ఇచ్చినా, పోలీసులు తమ పనిని తాము చేసుకుపోయారు. కర్ఫ్యూ విధించిన వేళ, నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ కేసు పెట్టారు. తను చేసిన పనికి ఆ యువతి క్షమాపణ చెప్పింది. తప్పును తెలుసుకున్నానని చెప్పడం తో పాటుగా తనలా ఎవరూ ప్రవర్తించవద్దని ఒక వీడియో స్టేట్మెంట్ ఇచ్చింది.

అటు పోలీసులు కూడా ఇటువంటి తుంటరి పనులు చేస్తే, చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం ఆదేశించిన నిబంధనలన్నీ పాటించాల్సిందేనన్నారు.


Next Story