మహిళా కానిస్టేబుల్ పురుషుడిగా మార్పు.. ఇప్పుడు బిడ్డకు జననం
కొందరు హార్మోన్స్ ప్రభావం వల్ల లింగ మార్పిడి చేసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 21 Jan 2024 6:10 AM GMTమహిళా కానిస్టేబుల్ పురుషుడిగా మార్పు.. ఇప్పుడు బిడ్డకు జననం
కొందరు హార్మోన్స్ ప్రభావం వల్ల లింగ మార్పిడి చేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళా కానిస్టేబుల్ కూడా పురుషుడిగా మారింది. ఆ తర్వాత మగబిడ్డకు తండ్రి అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన లలితా సాల్వే 2018లో లింగ మార్పిడి శస్త్రచికిత్స చేసుకుంది. ఆతర్వాత వివాహం చేసుకుని పండంటి మగబిడ్డకు తండ్రి అయ్యారు. లలిత్ కుమార్ సాల్వే 1988లో జన్మించింది. 2010లో మహిళా కానిస్టేబుల్‌గా ఎంపిక అయ్యింది. 2013లో శరీరంలో వస్తున్న మార్పులను గమనించిన లలితా సాల్వే వైద్య పరీక్షలు చేయించుకుంది. ఆమెలో పురుషుల్లో ఉండే Y క్రోమోజోములు ఉన్నట్లు వైద్యులు చెప్పారు. పురుషులు X, Y సెక్స్ క్రోమోజోములు కలిగి ఉంటారు. స్త్రీలు రెండు X క్రోమోజోములు కలిగిఉంటారు. అప్పుడు సాల్వేకు జెండర్ డిస్పోరియా ఉందనీ.. లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకోవాలని వైద్యులు చెప్పారు.
ఈ క్రమంలోనే 2018లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాత కానిస్టేబుల్ లలితా సాల్వే లింగమార్పిడి చేయించుకుంది. అప్పట్లో సాల్వే వార్తల్లో కూడా నిలచారు. 2018 నుంచి 2020 మధ్య లలితా సాల్వే మూడు సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. పూర్తిగా లింగమార్పిడి తర్వాత 2020లో ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన ఓ మహిళతో సాల్వే వివాహం జరిగింది. అనంతరం జనవరి 15న బిడ్డకు తండ్రి అయ్యాడు. మగబిడ్డకు జన్మనిచ్చి తండ్రిగా మారడం సంతోషాన్ని ఇచ్చిందని సాల్వే చెప్పారు. అయితే.. తాను మహిళ నుంచి పురుషుడిగా మారడానికి ఎంతో సమయం పట్టిందన్నారు. తన ప్రయాణం ఎన్నో పోరాటాలతో కూడుకున్నది అని చెప్పారు.