ఆఫీస్‌లో దుస్తులు, శరీరాకృతిపై వేధింపులు, మహిళా ఉద్యోగి సూసైడ్
ఉత్తర్ ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. తోటి ఉద్యోగుల వేధింపులను తాళలేక బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 July 2024 5:13 AM GMTఆఫీస్‌లో దుస్తులు, శరీరాకృతిపై వేధింపులు, మహిళా ఉద్యోగి సూసైడ్
ఉత్తర్ ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. తోటి ఉద్యోగుల వేధింపులను తాళలేక బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. శరీరాకృతి, ఆమె ధరిస్తున్న దుస్తుల పట్ల ప్రతిరోజు విమర్శలు, కామెంట్స్ చేస్తూ వచ్చారు. దాంతో.. విసుగెత్తిన సదురు యువతి సూసైడ్ చేసుకుంది. ఈ మేరకు సూసైడ్ నోట్‌ను కూడా ఆమె రాసిపెట్టింది. ఈ వార్త ప్రస్తుతం స్థానికంగా సంచలనంగా మారింది.
నోయిడాలోని యాక్సిస్ బ్యాంకులో బ్రాంచ్‌లో శివాని అనే యువతి పనిచేస్తోంది. ఘాజియాబాద్‌లోని తన ఇంట్లో ఆమె సూసైడ్ చేసుకుంది. అయితే.. శివాని శరీరాకృతితో పాటు దుస్తుల విషయంలో సహోద్యోగులు హేళన చేశారనీ.. దాంతో టార్చర్‌గా భాఇంచి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆత్మహత్య లేఖ రాసింది. ఈ మేరకు ఘాజియాబాద్ డీసీపీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. శివాని కార్యాలయంలో పనిచేసే తోటి మహిళా ఉద్యోగులే వేధింపులకు పాల్పడ్డారని వెక్కించేవారని మృతురాలి సోదరుడు చెప్పాడు. మృతురాలు తన సూసైడ్ లెటర్‌లో ఐదుగురి పేర్లను చేర్చినట్లు తెలిసింది.
ఆమె సోదరుడు ఇంకొన్ని విషయాలను కూడా మీడియాకు చెప్పాడు. తన సోదరి చాలా సార్లు జాబ్‌కు ఈ విషయంలోనే రిజైన్ చేద్దామని అనుకుందని తెలిపాడు. కానీ కంపెనీ వారు ఏదో కారణంగా రిజైన్‌ను తిప్పిపంపారని పేర్కొన్నాడు. ఓసారి శివానిపై దాడి జరిగిందనీ.. దాంతో శివాని ఒక మహిళ చెంప పగలగొట్టిందని కూడా తెలిపాడు. చెంపదెబ్బ తర్వాత శివానికి టెర్మినేషన్ నోటీసులు వచ్చాయని తెలిపాడు. ఈ ఘటన మరింత ప్రభావం చూపిందని పేర్కొన్నాడు. ఆఫీసులో వేధింపు పట్ల శివానీ పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదనీ.. చర్యలు తీసుకోలేదని మృతురాలి సోదరుడు ఆరోపించాడు.