హెయిర్ కటింగ్‌లో పొరపాటు.. భారీ జరిమానా విధించిన కోర్టు..!
Woman awarded Rs 2 crore compensation for wrong haircut.హెయిర్ కటింగ్ విషయంలో ఓ హోటల్‌కు భారీ జరిమానా విధించింది
By అంజి Published on 24 Sept 2021 8:16 AM ISTహెయిర్ కటింగ్ విషయంలో ఓ హోటల్‌కు భారీ జరిమానా విధించింది కన్సుమర్ కోర్టు. మూడేళ్ల పాటు విచారణ కొనసాగిన ఈ కేసులో సదరు మహిళకు తీవ్ర నష్టం కలిగినట్టు భావించిన కోర్టు.. ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు రూ.2 కోట్ల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే... మోడల్‌గా పని చేస్తున్న ఓ 42 ఏళ్ల మహిళ 2018వ సంవత్సరంలో ఓ ఇంటర్య్వూకు సంబంధించి చెన్నైకి వెళ్లింది. ఐటీసీ మౌర్య హెటల్‌లో స్టే చేసింది. ఈ క్రమంలోనే హెయిర్ కటింగ్ చేసుకునేందుకు హోటల్‌లోని హెయిర్ సెలూన్‌కి వెళ్లింది. అక్కడ సదరు హెయిర్ డ్రస్సర్‌కి కటింగ్ విషయంలో మోడల్ పలు సూచనలు చేసింది. తనకు ముఖ్యమైన పని ఉందని, జుట్టును కింది నుంచి 4 అంగుళాల వరకు కత్తిరించాలని చెప్పింది.
మోడల్ చెప్పిన సూచనలకు తల ఊపిన హెయిర్ డ్రస్సర్... అందుకు విరుద్ధంగా కటింగ్ చేసింది. జుట్టును కింది నుంచి కాకుండా మొదలు నుంచి 4 అంగుళాల వరకు ఉండేలా కటింగ్ చేసింది. దీంతో సదరు మోడల్ తనకు జరిగిన నష్టంపై హోటల్ సిబ్బందిని సంప్రదించింది. అందుకు వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. నేషనల్ కన్సుమర్ డిస్ప్యూట్ రీడ్రెస్సల్ కమిషన్‌ను సంప్రదించింది. తనకు జరిగిన నష్టాన్ని కోర్టుక విన్నవించుకుంది. హెయిర్ డ్రస్సర్ ఉపయోగించిన కెమికల్స్ వల్ల తన జుట్టు పాడైందని కోర్టుకు తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. సదరు మోడల్‌కు ఐటీసీ మౌర్య హోటల్ నుంచి తీవ్ర నష్టం జరిగినట్లుగా భావించింది. జరిగిన నష్టానికి గాను మోడల్‌కు రూ.2 కోట్లను చెల్లించాలంటూ కన్సుమర్ కోర్టు తీర్పు చెప్పింది.