అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆమె పోరాట యోధురాలని, మళ్లీ పునరాగమనం చేస్తారని ఆమె తల్లి పూర్వీకుల గ్రామమైన తులసేంద్రపురం వాసులు తెలిపారు. అమెరికా ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఉదయం నుండి స్థానికులు టెలివిజన్ స్క్రీన్‌లకు అతుక్కుపోయారు. హారిస్ విజయం కోసం శ్రీ ధర్మ శాస్తా పెరుమాళ్ ఆలయాన్ని కూడా సందర్శించారు.
ఈ ఫలితాలపై గ్రామస్థులు బాధను వ్యక్తం చేసినా, రాబోయే రోజుల్లో కమల పుంజుకుంటారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె విజయం సాధిస్తుందని, దీపావళి కంటే పెద్ద వేడుకలను ప్లాన్ చేసినట్లు తెలిపారు. సామూహిక బోజనాలను కూడా ఏర్పాటు చేసామన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని తప్పక మెచ్చుకోవాలని పలువురు తెలిపారు. ఏదో ఒక రోజు US అధ్యక్షురాలు అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చేసారి కమలా హారిస్ గెలుపొంది తమ గ్రామాన్ని సందర్శిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఆ రోజు వచ్చినప్పుడు, మేము ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెబుతామన్నారు. డొనాల్డ్ ట్రంప్ గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు. అతను భారతదేశంతో సత్సంబంధాలను పెంపొందించుకుంటారని, ప్రపంచ శాంతిని పెంపొందించాలని ఆశిస్తున్నామన్నారు గ్రామస్థులు.