ఐపీఎల్ ఆడిన పలు ఆటగాళ్ల దశ తిరిగింది. ఈ ఏడాది ఐపీఎల్ వేలంపాటలో పలువురు యువకులకు కూడా మంచి ధర లభించింది. ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ కుమారుడు సార్థక్ రంజన్ ను కోల్ కతా యాజమాన్యం సొంతం చేసుకుంది. ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడే సార్థక్‌ను కేకేఆర్ రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ కు తన కుమారుడు ఎంపికవడంపై పప్పు యాదవ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నీ ప్రతిభతో నీకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎక్స్ లో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. సార్థక్ రంజన్ ఇప్పటివరకు ఢిల్లీ తరఫున 2 ఫస్ట్-క్లాస్, 4 లిస్ట్-ఏ, 5 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.