మాస్క్‌డ్ ఆధార్‌తో భద్రత.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా?
ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అయితే చాలా మంది అనేక చోట్లలో ఆధార్ ఫొటో కాపీని ప్రూఫ్‌గా ఇస్తుంటారు. దీని వల్ల ఆధార్ వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
By అంజి Published on 20 Nov 2024 7:30 AM GMTమాస్క్‌డ్ ఆధార్‌తో భద్రత.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా?
ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అయితే చాలా మంది అనేక చోట్లలో ఆధార్ ఫొటో కాపీని ప్రూఫ్‌గా ఇస్తుంటారు. దీని వల్ల ఆధార్ వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్కామ్‌లు కూడా జరగవచ్చు. అందుకే మన ఆధార్‌ను సురక్షితంగా ఉంచుకోవాలి. ఇందుకు మాస్క్‌డ్ ఆధార్‌ను ఉపయోగించాలి. ఇంతకీ ఏంటీ మాస్క్‌డ్ ఆధార్ కార్డ్? దీన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? వంటి వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం..
ఆధార్ కార్డు దుర్వినియోగానికి చరమగీతం పాడాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ మాస్క్‌డ్ ఆధార్ కార్డును తీసుకొచ్చింది. తప్పనిసరిగా ఆధార్ వివరాలు అవసరం లేని చోట్ల వీటిని ఉపయోగించాలని సూచించింది. సాధారణంగా ఆధార్ కార్డులో 12 అంకెలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఈ మాస్క్‌డ్ ఆధార్‌లో.. చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. మొదటి 8 అంకెలు కనిపించవు. దీనివల్ల మీ ఆధార్ నెంబర్‌ను ఎవరూ దుర్వినియోగం చేయలేరు.
ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
ముందుగా బ్రౌజర్‌లో UIDAI వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అందులో Get Aadhaar అనే ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మరికొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో 'డౌన్‌లోడ్ ఆధార్'పై క్లిక్ చేయాలి. అనంతరం 12 అంకెల ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్‌మెంట్ ఐటీ లేదా వర్చువల్ ఐడీ నెంబర్‌ను ఎంటర్ చేసి క్యాప్చాను కూడా నమోదు చేయాలి. ఆ తర్వాత Send OTP పై క్లిక్ చేస్తే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి OTP వస్తుంది.
OTP ఎంటర్ చేసేటప్పుడే.. దానిపై 'Do you want a masked Aadhaar?' అని అడుగుతుంది. ఆ ఆప్షన్‌ను ఎంచుకుంటే మాస్క్‌డ్ ఆధార్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది. ఆధార్ డౌన్‌లోడ్ అయిన తర్వాత ఆ పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఆ ఫైల్‌ను ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ అడుగుతుంది. ఉదాహరణకు మీ పేరు ఆంగ్ల అక్షరాల్లో PILLISREEJA, మీరు పుట్టిన సంవత్సరం 2002 అనుకుంటే.. మీ పాస్వర్డ్ 'PILLI2002' అవుతుంది. అంటే మీ పేరులోని తొలి నాలుగు అక్షరాలు, పుట్టిన ఏడాది కలిపితే అదే పాస్‌వర్డ్.