పాఠ్యాంశంగా కరోనా వైరస్
West Bengal Board Adds Coronavirus in Class 11 Syllabus.కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు.
By తోట వంశీ కుమార్ Published on 12 Sept 2021 12:38 PM ISTకరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ మహమ్మారి కారణంగా జన జీవనం అస్తవ్యస్తమైంది. కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు ఎంతగా చెబుతున్నా.. కొందరు మాత్రం మాత్రం పాటించడం లేదు. ఇక చాలా ప్రాంతాల్లో పాఠశాలలు కూడా ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లోని 11వ తరగతిలో 'హెల్త్ అండ్ ఫిజకల్ ఎడ్యుకేషన్' సబ్జెక్ట్‌లో కరోనా వైరస్‌కు సంబంధించిన పూర్తి అంశాలను బోధించాలని నిర్ణయించింది.
కరోనా వైరస్ అంటే ఏమిటి..? ఇది ఇతరులకు ఎలా వ్యాపిస్తుంది..? లక్షణాలు ఏమిటి..? క్వారంటైన్‌కు సంబంధించిన వివరాలు అందులో ఉంటాయి. కాగా.. కేవలం 11 తరగతి విద్యార్థులకే కాకుండా.. 6 నుంచి 10వ తరగతి పాఠ్యాంశాల్లో బోధించాలని ఆ రాష్ట్ర విద్యా శాఖ బావిస్తోంది. దీంతో అలాంటి ఆలోచనలతో ముందుకు రావాలని కరోనా నియంత్రణకు ఏర్పాటు చేసిన సలహా కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కరోనా మహమ్మారి కారణంగా మన ఆత్మీయులను కోల్పోయాం. దీనిపై విద్యార్థుకు కనీస అవగాహన అవసరం అని ఓ విద్యాశాఖ అధికారి అన్నారు. విద్యార్థుల్లో అవగాహన వస్తే.. వ్యాధి రాకుండా జాగ్రత్తగా ఉండడంతో పాటుకొంత నియంత్రించవచ్చునని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటు వ్యాధుల నిపుణులు డా. యోగిరాజ్ రాయ్ తెలిపారు.