రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయ్‌పత్ కన్నుమూత

ప్రముఖ పారిశ్రామికవేత్త, రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్‌పత్ సింఘానియా (87) శనివారం సాయంత్రం ముంబైలో కన్నుమూశారు.

By -  అంజి
Published on : 29 March 2026 7:35 AM IST

Vijaypat Singhania Death, Raymond Group Former Chairman, Gautam Singhania, Padma Bhushan Awardee, Aviation World Record, Mumbai Business Icon, Last Rites Mumbai, Industrialist Passes Away

రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయ్‌పత్ కన్నుమూత

ప్రముఖ పారిశ్రామికవేత్త, రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్‌పత్ సింఘానియా (87) శనివారం సాయంత్రం ముంబైలో కన్నుమూశారు. వ్యాపారవేత్తగానే కాకుండా పరోపకారిగా, విమానయాన రంగంలో రికార్డులు సృష్టించిన సాహసికుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఆయన కుమారుడు, రేమండ్ గ్రూప్ ప్రస్తుత ఛైర్మన్ గౌతమ్ సింఘానియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా "RIP. ఓం శాంతి" అని పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని ధృవీకరించారు. రేమండ్ గ్రూప్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, ఎయిర్ కమోడోర్ విజయ్‌పత్ సింఘానియా తుది శ్వాస విడిచారని, మార్చి 29 ఆదివారం మధ్యాహ్నం ముంబైలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.

1930వ దశకం చివరలో జన్మించిన విజయ్‌పత్ సింఘానియా, రేమండ్ గ్రూపును ప్రపంచస్థాయి బ్రాండ్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సంస్థ ఛైర్మన్‌గా ఉండి, తయారీ , ఎగుమతి రంగాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించారు. వ్యాపారంతో పాటు విమానయానంపై ఆయనకు ఉన్న మక్కువతో హాట్ ఎయిర్ బెలూనింగ్‌లో ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పారు 'ఎయిర్ కమోడోర్'గా సేవలు అందించిన ఆయన, బాంబే షెరీఫ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. దేశ పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం 'పద్మభూషణ్' పురస్కారంతో సత్కరించింది.

ఆయన వీడ్కోలు సందర్భంగా సింఘానియా కుటుంబం భగవద్గీతలోని "కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన.." శ్లోకాన్ని స్మరించుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. 2000వ సంవత్సరంలో తన కుమారుడు గౌతమ్ సింఘానియాకు బాధ్యతలు అప్పగించిన తర్వాత, తండ్రీకొడుకుల మధ్య కొన్ని ఆస్తి వివాదాలు తలెత్తినప్పటికీ, చివరికి అవి సామరస్యపూర్వకంగా పరిష్కారమయ్యాయి. ముంబైలోని చందన్‌వాడి స్మశానవాటికలో ఆయన పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

Next Story