స్వదేశానికి ఫోగట్, అభిమానులను చూసి భావోద్వేగం (వీడియో)
పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 1:15 PM ISTస్వదేశానికి ఫోగట్, అభిమానులను చూసి భావోద్వేగం (వీడియో)
పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆమె కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్న కారణంగా ఫైనల్స్ నుంచి తప్పించారు ఒలింపిక్స్ నిర్వాహకులు. ఆ తర్వాత ఆమె ఎన్ని విధాలా ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీనిపై వినేశ్ ఫోగాట్ చేసిన అప్పీలును కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(కాస్) తిరస్కరించింది. ఆమె పోరాట ప్రతిమను ప్రతి భారతీయుడు ప్రశంసిస్తున్నారు. గోల్డ్ మెడల్ అవసరం లేదనీ.. నువ్వే మాకు ఒక మెడల్ అంటూ చెప్పుకొచ్చారు. రాజకీయ పెద్దల నుంచి ప్రతి ఒక్కరూ వినేశ్ ఫోగట్‌కు అండగా నిలిచారు. తాజాగా పారిస్ నుంచి వినేశ్ ఫోగట్ స్వదేశానికి చేరుకున్నారు. ఆమెకు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా అభిమానులను చూసిన వినేశ్ ఫోగట్ భావోద్వేగానికి లోనయ్యారు.
వెల్‌కమ్ చెప్పేందుకు వచ్చిన వారిని చూసి.. వారి ప్రేమను చూసి రెజ్లర్ వినేశ్ ఫోగట్ కన్నీటి పర్యంతం అయ్యారు. వినేశ్ పతకం గెలవకపోయినా అభిమానుల మనసులు గెలుచుకున్నారు. పతకం గెలిచిన క్రీడాకారుడికన్నా ఎక్కువగా అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో పోలీసులు అదనపు భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది.
వినేశ్ ఫోగట్ ఎయిర్‌పోర్టు టెర్మినల్ నుంచి బయటకు రాగానే బ్యాండ్ మేళం, పూలమాలతో తోటి రెజ్లర్లు, కుటుంబ సభ్యులు, అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్చెప్పారు. వినేశ్ కన్నీటిని ఆపుకునేందుకు ప్రయత్నించినా.. ఆమె వల్ల కాలేదు. వినేశ్ ను ఊరేగింపుగా తీసుకెళుతుండగా కంటతడి పెట్టారు. పక్కనే ఉన్న తోటి రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా వినేశ్ ను ఓదార్చారు.
बहन विनेश फोगाट आज देश लौट रही है।
— Suman Meena (@SumanNaresh4) August 17, 2024
उनके आंखों में जो दर्द है 😢
वह आप महसूस कर सकते हो ।
बेटी ने न्याय के लिए देश में और विदेश में संघर्ष किया।😌
पर अफसोस आंसुओं के अलावा कुछ नहीं मिला😭
Vinesh पर हमें गर्व है 🙏💐💐#Phogat_Vinesh pic.twitter.com/kXqyDtJq6C