ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (73) ఆదివారం ఛాతీ నొప్పి, అసౌకర్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. ఆయనను తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్రిటికల్ కేర్ యూనిట్ (సిసియు)లో పరిశీలనలో ఉన్నారు. ఎయిమ్స్‌లోని కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ధన్‌ఖడ్ చికిత్స పొందుతున్నారని, వైద్యుల బృందం ఆయన పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని నివేదిక పేర్కొంది.
ఉపరాష్ట్రపతి ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పీటీఐ వర్గాలు ఉటంకిస్తూ తెలిపాయి. ధన్‌ఖడ్ చేరిన కొద్దిసేపటికే ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు జేపీ నడ్డా ఎయిమ్స్‌ను సందర్శించారు. జగదీప్ దన్ఖడ్‌కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఉప-రాష్ట్రపతిగా 2022లో ఆయన ఎన్నికైన విషయం తెలిసిందే. దీనికి ముందు పశ్చిమ్ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు.