కొత్తగా ఆధార్ తీసుకుంటున్నారా?.. అయితే ఈ రూల్ పాటించాల్సిందే
18 ఏళ్లు పైబడిన వారు, తొలిసారిగా ఆధార్‌ను పొందాలనుకునే వారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని యూఐడీఏఐ తెలిపింది.
By అంజి Published on 21 Dec 2023 8:31 AM ISTకొత్తగా ఆధార్ తీసుకుంటున్నారా?.. అయితే ఈ రూల్ పాటించాల్సిందే
18 ఏళ్లు పైబడిన వారు, తొలిసారిగా ఆధార్‌ను పొందాలనుకునే వారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ప్రకటించింది. "18 సంవత్సరాల తర్వాత వారి మొదటి ఆధార్‌ను కోరుకునే వారి కోసం పాస్‌పోర్ట్ లాంటి వెరిఫికేషన్ సిస్టమ్ అమలులో ఉంటుంది" అని UIDAI నుండి ఒక అధికారి తెలిపారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, సబ్-డివిజనల్ స్థాయిలలో నోడల్ అధికారులను, అదనపు జిల్లా మేజిస్ట్రేట్లను నియమిస్తుందని అధికారి తెలిపారు.
అటువంటి వ్యక్తుల కోసం ఆధార్ సదుపాయం ఎంపిక చేయబడిన కేంద్రాలలో అందుబాటులో ఉంటుంది, వీటిలో ప్రతి జిల్లా యొక్క ప్రధాన పోస్టాఫీసు, యూఐడీఏఐ గుర్తించిన ఇతర ఆధార్ కేంద్రాలు ఉన్నాయి.తొలిసారిగా దరఖాస్తు చేసుకునే వారి వివరాలపై డాటా క్వాలిటీ చెక్స్ నిర్వహిస్తారు. అనంతరం, సర్వీస్ పోర్టల్ ద్వారా వెరిఫికేషన్‌కు పంపిస్తారు. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఇలా క్లియరెన్స్ పొందిన 180 రోజులలోపు ఆధార్ జారీ చేస్తారు.
యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ప్రశాంత్ కుమార్ సింగ్ ఒక పత్రికా ప్రకటనలో.. ఈ కొత్త ఆదేశాలు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి ఆధార్‌ను మొదటిసారిగా పొందుతున్న వారికి మాత్రమే వర్తిస్తాయి. "ఒకసారి వారి ఆధార్‌ను తయారు చేసిన తర్వాత, వారు కూడా సాధారణ ప్రక్రియల ద్వారా దానిని అప్‌డేట్ చేసుకోవచ్చు" అని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు 18 ఏళ్లు పైబడిన 16.55 కోట్ల మంది తమ ఆధార్‌ను పొందారు. ప్రతి నెలా, 18 ఏళ్లు పైబడిన వారి 13,246 ఆధార్ నామినేషన్లను ప్రాసెస్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 14,095 ఆధార్ నామినేషన్, అప్‌డేట్ మిషన్ల ద్వారా ఆధార్ పనులు జరుగుతున్నాయి.