జనవరి నుంచి మరింత కఠినం

Vehicle pollution check.. వాహన కాలుష్య నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరిత కఠనంగా వ్యవహరించనుంది. వాహన

By సుభాష్  Published on  30 Nov 2020 3:48 AM GMT
జనవరి నుంచి మరింత కఠినం

వాహన కాలుష్య నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరిత కఠనంగా వ్యవహరించనుంది. వాహన కాలుష్య నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పొల్యూషన్‌ అండర్ కంట్రోల్‌ సర్టిఫికేట్‌ లేకపోతే వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ను స్వాధీనం చేసుకునే విధంగా చర్యలు చేపడుతోంది. ఈ విధానం వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి తీసుకురాబోతోంది. ఈ మేరకు అందరి సూచనలు, సహాలు కోరుతూ గత శుక్రవారం ముసాయిదా నోటిఫికేషన్‌ను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ జారీ చేసింది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి రెండు నెలల సమయం పట్టనుంది. కొత్త వ్యవస్థలో భాగంగా వాహన యజమాని వివరాలను మోటారు వాహనాల డేటాబెస్‌కు అనుసంధానించిన సర్వర్లకు అప్‌లోడ్‌ చేస్తారు. దీని మూలంగా పీయూసీ సర్టిఫికేట్‌ లేకుండా వాహనదారులు తమ వాహనాన్ని నడిపినట్లయితే కష్టాలు తెచ్చుకోవాల్సిందే. వాహన యజమాని వాహన పీయూసీని నిర్ధేశిత గడువులోపల తప్పనిసరిగా పునరుద్దరించుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ చెల్లుబాటులో లేని పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ ఉంటే వారం రోజులు గడువిస్తారు. ఆ తర్వాత కూడా సర్టిఫికేట్‌ను తీసుకోని పక్షంలో ఆర్సీని స్వాధీనం చేసుకుంటారు. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిబంధనలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

వాహనాలకు ఒకే పొల్యూషన్‌ సర్టిఫికెట్‌

కాగా, వాహనాల పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ సర్టిఫికెట్‌లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని వాహనాలకు ఒక రకమైన పీయూసీ సర్టిఫికెట్‌ జారీ చేసేలా చర్యలు చేపడుతోంది కేంద్రం. ఈ సర్టిఫికెట్‌ క్యూఆర్‌ కోడ్‌తో ఉండనుంది. ఇందులో వాహన యజమాని, వాహనంకు సంబంధించి తదితర వివరాలు ఉంటాయి. ఈ మార్పును ప్రతిపాదిస్తూ గత శుక్రవారం రవాణా మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసింది. అంతేకాకుండా పీయూసీ తీసుకోవడానికి ముందే వాహన యజమాని రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ అందే విధంగా చర్యలు చేపడుతోంది.

Next Story
Share it