లోక్‌సభ ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె

గంధపు చెక్కలను స్మగ్లింగ్‌ చేసిన వీరప్పన్‌ కుమార్తె ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  24 March 2024 6:45 PM IST
veerappan daughter,  lok sabha, election, tamilnadu,

 లోక్‌సభ ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె  

గంధపు చెక్కలను స్మగ్లింగ్‌ చేసిన వీరప్పన్‌ పేరు ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన కుమార్తె ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇన్నాళ్లు వీరప్పన్ కుమార్తె విద్యారాణి బీజేపీలో ఉన్నారు. తాజాగా ఆమె ఆ పార్టీని వీడారు. నామ్‌ తమిళర్‌ కట్చి నుంచి లోక్‌సభ టికెట్‌ను దక్కించుకున్నారు. తమిళనాడులోని కృష్ణగిరి నియోజకవర్గం నుంచి వీరప్పన్ కుమార్తె విద్యారాణి లోక్‌సభ బరిలో నిలబడుతున్నారు. ఈ మేరకు మాట్లాడిన విద్యారాణి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు వెల్లడించారు.

కాగా.. విద్యారాణి వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేశారు. అంతేకాదు.. గిరిజనులు, దళితుల హక్కుల కోసం పోరాడారు. ఉద్యమకారణిగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. మెల్లిగా రాజకీయాల్లోకి వచ్చిన విద్యారాణి 2020లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆమె కొంతకాలం పార్టీకి పనిచేవౄరు. రాష్ట్ర యువజన విభాగానికి ఉపాధ్యాక్షురాలిగా కొనసాగారు. ఇటీవల నటుడు, డైరెక్టర్‌ సీమాన్‌ నేతృత్వంలోని నామ్‌ తమిళర్ కట్చి (ఎన్‌టీకే) పార్టీలో చేరేందుకు బీజేపీకి గుడ్‌ బై చెప్పారు. ప్రస్తుతం విద్యారాణి ఎన్‌టీకే పార్టీ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.

ఎన్టీకే పార్టీకి తమిళనాడులో క్రమంగా ఆదరణ పెరుగుతూ వస్తోంది. 2016లో కేవలం 1.1 శాతం ఓట్లే పోల్ అయ్యాయి. కానీ ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో 4 శాతం ఓట్లను సాధించింది. ఇక 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఏకంగా 6.7 శాతానికి పెరిగింది. ఎన్‌టీకే పార్టీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో వీరప్పన్ కుమార్తె విద్యారాణి అందులో చేరి టికెట్‌ దక్కించుకోవడం విశేషం. ఇక తన తండ్రి గురించి మాట్లాడుతూ.. ఆయన కూడా ప్రజలకు సేవ చేయాలని భావించారు కానీ ఎంచుకున్న మార్గం సరైనది కాదని అన్నారు. ఇక తాను మూడో తరగతి చదువుతున్నప్పుడు తండ్రి వీరప్పన్‌ను కలిశాననీ.. అదే మొదటి ఇంకా చివరి సారి కూడా అని విద్యారాణి గుర్తు చేసుకున్నారు. కాగా.. వీరప్పన్‌ 2024 అక్టోబర్ 18న ఎన్‌కౌంటర్‌లో హతమైన విషయం తెలిసిందే.

Next Story