వందేభారత్‌లో ఇవాళ ఫ్రీ జర్నీ.. ఎక్కడంటే..
ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో వందేభారత్ రైలు పట్టాలు ఎక్కనుంది
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 7:30 AM ISTఉత్తర్‌ప్రదేశ్‌లో మరో వందేభారత్ రైలు పట్టాలు ఎక్కనుంది. మీరట్-లక్నో మధ్య ఇవాళ్టి నుంచి వందే భారత్ సర్వీసు అందుబాటులోకి వస్తోంది. ఈ రూట్‌లో వందేభారత్ చార్జీలతో పాటు.. రాకపోకల సమయాలను రైల్వే శాఖ వెల్లడించింది. అతిథి ప్రయాణికులకు ఇవాళ రైల్వే శాఖ మంచి అవకాశం కల్పించింది. మీరట్-లక్నో మధ్య ఇవాళ ఉచితంగా జర్నీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఇక లక్నో-మీరట్(22491), మీరట్-లక్నో(22490) వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల రెగ్యులర్ ఆపరేషన్ ఆదివారం నుండి ప్రారంభంకానుంది. అయితే.. . మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభిస్తారు. శుక్రవారం నుంచే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఈ రైలు అప్‌డేట్ అయిన తర్వాత టికెట్ బుకింగ్ ప్రారంభమైంది.
వందేభారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం బరేలీ జంక్షన్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే.. మీరట్-లక్నో మధ్య నడిచే ఈ వందేభారత్ రైలు మొరాదాబాద్, బరేలీ జంక్షన్లలో మాతమ్రే ఆగనుంది. సెప్టెంబర్ 5 తర్వాత తేదీల ప్రయాణం కోసం సీట్లు వేగంగా బుక్ అవుతున్నాయని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇవాళ్టి ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం బరేలీ జంక్షన్‌లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. ఈ వందేభారత్ రైలు మీరట్ నుండి ఉదయం 6:35 గంటలకు బయలుదేరుతుంది. 8:35 గంటలకు మొరాదాబాద్ చేరుకుని.. అక్కడ కాసేపు ఆగుతంది. మళ్లీ ఉదయం 9:56 గంటలకు బరేలీ చేరుకుని మధ్యాహ్నం 1:45 గంటలకు లక్నో చేరుకుంటుంది. అలాగే లక్నో-మీరట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లక్నో నుండి మధ్యాహ్నం 2:45 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:02 గంటలకు బరేలీకి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి రాత్రి 7:32 గంటలకు మొరాదాబాద్, రాత్రి 10 గంటలకు మీరట్ చేరుకుంటుంది. ఇవాళ ఫ్రీ జర్నీ కల్పించడంతో అక్కడి ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని.. వందేభారత్ రైలు ప్రయాణాన్ని ఆస్వాదించేందుకు రెడీ అవుతున్నారు.