180 కి.మీ వేగంతో దూసుకువెళ్లిన వందే భారత్ ట్రైన్

Vande Bharat Express Crosses 180 Kmph Speed Limit During Trial Run.దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్ రైలు అయిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Aug 2022 1:36 PM IST
180 కి.మీ వేగంతో దూసుకువెళ్లిన వందే భారత్ ట్రైన్

దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్ రైలు అయిన వందేభార‌త్ రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా నిర్వ‌హించిన ట్ర‌య‌ల్ ర‌న్‌లో రైలు గంట‌కు 180 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకువెళ్లింది. ఈ విష‌యాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. కోటా-నాగ్డా సెక్ష‌న్ మ‌ద్య శుక్ర‌వారం టెస్ట్ ర‌న్‌ను నిర్వ‌హించ‌గా రైలు ఈ వేగాన్ని అందుకున్న‌ట్లు మంత్రి తెలిపారు.

తొలి వందేభార‌త్ రైలు 2019లోనే దేశంలో అందుబాటులోకి వ‌చ్చింది. ఢిల్లీ-వార‌ణాసి మార్గంలో దీన్ని తొలుత అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. ఆ త‌రువాత ఢిల్లీ-వైష్ణోదేవీ మార్గంలో రెండో రైలును తీసుకువ‌చ్చారు. తాజాగా కోటా(రాజ‌స్థాన్‌)- న‌గ్ధా(మ‌ధ్య‌ప్ర‌దేశ్) సెక్ష‌న్లో ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హించారు. టెస్ట్ ర‌న్ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో రైలులో వాషింగ్‌, క్లీనింగ్‌తో పాటు అన్ని ప‌రిక‌రాల ప‌నితీరును ప‌రిశీలించిన‌ట్లు మంత్రి ట్వీట్ చేశారు.

రైలు వేగాన్ని కొలిచే స్పీడో మీట‌ర్ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఆన్ చేసి దాన్ని రైలు విండో ప‌క్క‌న పెట్టి వీడియోను తీశారు. ఆ వీడియో ఓ స‌మ‌యంలో రైలు 183 కిలోమీట‌ర్ల గ‌రిష్ట వేగాన్ని అందుకోవ‌డం క‌నిపించింది. వేగంగా వెలుతున్న‌ప్ప‌టికీ మంచి గ్లాసు కూడా పెద్ద‌గా కుదుపుల‌కు లోనుకాక‌పోవ‌డం విశేషం. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వందే భార‌త్ రైల్లు దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.

Next Story