ఉత్తరాఖండ్‌లో నదిలో పర్యాటకుల వాహనం బోల్తా, ఆరుగురు గల్లంతు

ఉత్తరాఖండ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. తెహ్రి జిల్లా గులార్‌ దగ్గర నదిలో పర్యాటకుల వాహనం బోల్తా పడింది.

By Srikanth Gundamalla  Published on  9 July 2023 10:03 AM GMT
Uttarakhand, tourists vehicle, overturned, river,

ఉత్తరాఖండ్‌లో నదిలో పర్యాటకుల వాహనం బోల్తా, ఆరుగురు గల్లంతు

ఉత్తరాఖండ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. తెహ్రి జిల్లా గులార్‌ దగ్గర నదిలో పర్యాటకుల వాహనం బోల్తా పడింది. ఉత్తరాఖండ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగి రోడ్డుపైన పడ్డాయి. పర్యాటకుల వాహనం కొండచరియలను తప్పించబోయి అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే.. బోల్తా నదిలో వాహనం పడిన వెంటనే ఇతర వాహనదారుల సమాచారం మేరకు .. విపత్తు నిర్వహణ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి నదిలో పడిపోయిన 11 మందిలో ఐదుగురిని కాపాడారు. మరో ఆరుగురు పర్యాటకులు నదిలో గల్లంతు అయినట్లు అధికారులు తెలిపారు.

గల్లంతైన వారిలో తెలుగు వ్యక్తి:

అయితే పర్యాటకుల వాహనంలో ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన దంపతులు ఉన్నారు. రాజాం మండలం బొద్దాంకు చెందిన రవి రంగారావు దంపతులు హైదరాబాద్‌ నుంచి ఉత్తారఖండ్‌ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో భార్యను విపత్తు నిర్వహణ బృందం రక్షించింది. రవిరావు గల్లంతు అయ్యాడు. అతనితో పాటు మిగతా నలుగురి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.

సోన్‌ ప్రయాగ్‌ నుంచి పర్యాటకుల వామనం శనివారం రాత్రి 8 గంటలకు రిషికేష్‌కు బయల్దేరింది. ఈ క్రమంలో రాత్రి 3 గంటల సమయంలో తెహ్రీ జిల్లా గులార్‌ దగ్గర మలకుంతి బ్రిడ్జి దగ్గర ప్రమాదానికి గురైంది. రోడ్డుకు అడ్డంగా ఉన్న బండరాయిని తప్పించబోయి పర్యాటకుల వాహనం నదిలోకి దూసుకెళ్లింది. దీనికి గురించి వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఐదుగురిని కాపాడారు. వెంటనే గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన డ్రైవర్‌ సహా మరో ఆరుగురి కోసం గాలింపు కొనసాగుతోంది.

Next Story