ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి
Uttarakhand CM Tirath Singh Rawat resigns.ఉత్తరాఖండ్ రాష్ట్రానికి త్వరలోనే కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు. ఉత్తరాఖండ్
By తోట వంశీ కుమార్ Published on 3 July 2021 6:04 AM GMTఉత్తరాఖండ్ రాష్ట్రానికి త్వరలోనే కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి తీరథ్ సింగ్ శుక్రవారం రాజీనామా చేశారు. దీంతో కొత్త సీఎం ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో శనివారం బీజేపీ శాసనసభా పక్షం సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరుగనుంది. ఈ సందర్భంగా కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు. తీరథ్ సింగ్ రావత్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. వచ్చే రెండు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవసరం ఉంది. ఉత్తరాఖండ్ అసెంబ్లీ పదవీకాలం మార్చిలో ముగిసిపోనుంది. కేవలం తొమ్మిది నెలల్లో ఉత్తరాఖండ్‌లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఎలెక్షన్ కమీషన్ ఉప ఎన్నికకు ఆదేశించకపోవచ్చని బీజేపీలోని పరిశీలకులు భావిస్తున్నారు. రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించడానికి తీరథ్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు ఈసారి సిట్టింగ్ అభ్యర్థికే ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని అధిష్ఠానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
తీరత్ సింగ్ ప్రస్తుతం గర్వాల్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శనివారం జరగనున్న పార్టీ సమావేశంలో కొత్త శాసనసభా పక్ష నేతను ఎన్నుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మదన్ కౌశిక్ అధ్యక్షత వహిస్తారని రాష్ట్ర బీజేపీ మీడియా ఇన్‌ఛార్జి మన్వీర్ సింగ్ చౌహాన్ తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలందరూ సమావేశానికి హాజరు కావాలని కోరారు. బీజేపీ సీనియర్ నాయకుల పేర్లు సత్పాల్ మహారాజ్, బన్షిదర్ భగత్, హరక్ సింగ్ రావత్, ధన్ సింగ్ రావత్ పేర్లు రావత్ స్థానంలో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అవకాశాలు ఉన్నాయి.