తల్లి మందలించిందని ఇద్దరు తమ్ముళ్లతో పారిపోయిన 14 ఏళ్ల బాలిక..చివరకు

తల్లి చదువు విషయంలో మందలించిందిన.. 14 ఏళ్ల బాలిక తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి ఇంటిని వదిలి పారిపోయింది.

By Srikanth Gundamalla  Published on  30 Jun 2024 8:15 AM IST
uttar pradesh, three siblings, run away,  house,

 తల్లి మందలించిందని ఇద్దరు తమ్ముళ్లతో పారిపోయిన 14 ఏళ్ల బాలిక..చివరకు

తల్లిదండ్రులు ఏదైనా అంటే చాలు పిల్లలు అలుగుతారు.. లేదా ఏడుస్తారు. కానీ.. ఉత్తర్‌ ప్రదేశ్‌లో మాత్రం ఓ 14 ఏళ్ల బాలిక తన తల్లి చదువు విషయంలో తనని మందలించిందని అనూహ్యంగా ప్రవర్తించింది. తన ఇద్దరు తమ్ముళ్లను తీసుకుని ఇంటిని వదిలి వెళ్లిపోయింది. ఉత్తర్‌ ప్రదేశ్‌ను వదిలి వెళ్లి.. ఢిల్లీలో తేలారు.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌ జిల్లా బ్రిజ్‌మాన్‌గంజ్ ప్రాంతంలోని గుజ్రౌలియా చెందిన ఓ కుటంబంలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. 14 ఏళ్ల బాలికతో పాటు. మూడేళ్లు, ఆరేళ్ల బాలురు తోబుట్టువులు. అయితే.. పెద్ద కూతురు సరిగా చదవడం లేదని గమనించిన తల్లి చిన్నారిని మందలించింది. దాంతో మనస్థాపం చెందిన బాలిక ఇంటిని వదిలి వెళ్లిపోవాలని భావించింది. ఈ క్రమంలోనే తన ఇద్దరు తమ్ముళ్లను కూడా తనతో పాటే తీసుకుని బయటకు వెళ్లిపోయింది. పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల ప్రాంతాలు వెతికినా లాభం లేకపోయింది. చేసేందేం లేక పోలీసులను ఆశ్రయించారు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు.

ఆ తర్వాత వారు ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి ఢిల్లీ వెళ్లిపోయారు. దేశరాజధాని లోని నజాఫడ్‌ ప్రాంతంలో తిరుగుతున్నారు.అయితే.. పిల్లల వద్ద డబ్బులు లేకపోవడంతో పెద్ద బాలిక తమగ్రామానికి చెందిన ఓ యువకుడిని సంప్రదించేందుకు ప్రయత్నించింది. బాటసారి సాయంతో ఫోన్‌ను వాడి గ్రామానికి చెందిన యువకుడికి కాల్ చేసింది. దాంతో.. ఆ యువకుడు పిల్లల తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లొకేషన్ ఆధారంగా ఢిల్లీలో పోలీసుల సాయంతో ముగ్గురు చిన్నారులను గుర్తించారు. చివరకు వారిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంట్లో నుంచి పారిపోయిన పిల్లలు తిరిగి తమ చెంతకు చేరడంతో పేరెంట్స్‌ ఆనంద బాష్పాలు కార్చారు. పిల్లలు కనిపించకుండా పోయిన 4 రోజుల తర్వాత సొంత ఇంటికి పోలీసులు చేర్చారు.

పిల్లలు క్షేమంగా వారి కుటుంబానికి తిరిగి వచ్చినట్లు పోలీసు సూపరింటెండెంట్ సోమేంద్ర మీనా ధృవీకరించారు. చిన్నారులను కనిపెట్టడంలో కృషి చేసిన పోలీసులకు రూ.20వేల రివార్డును ప్రకటించారు.

Next Story