ఒక్క సెల్ఫీ ఫొటో పోలీస్ అధికారిని చిక్కుల్లో పడేసింది. మంచంపై నోట్ల కట్టలను పరిచి తన భార్య, పిల్లలతో సెల్ఫీ దిగాడు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక పోలీస్ అధికారి. ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అది వైరల్ గా మారింది. చివరకు ఉన్నతాధికారుల వరకు చేరింది. దీంతో.. సదురు అధికారిపై చర్యలు చేపట్టారు పోలీసు ఉన్నతాధికారులు.
రమేశ్‌చంద్ర సహానీ ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్‌లోని బెహ్తా ముజవార్ పోలీస్‌స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల తన భార్య, పిల్లలతో కలిసి ఇంట్లో ఒక సెల్ఫీ తీసుకున్నాడు. అదీ రూ.500 నోట్ల కట్టలను బెడ్‌పై పరిచి భార్య, పిల్లలతో ఫోటో తీసుకున్నాడు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. డబ్బులతో పోలీస్ కనిపించడంతో వైరల్‌గా మారింది. చివరకు ఉన్నతాధికారుల వరకు చేరింది. రూ.14 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు.
అంత పెద్దమొత్తంలో డబ్బు సదురు అధికారికి ఎక్కడివని ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు.. సహానీని పోలీస్ లైన్స్‌కు బదిలీ చేశారు. కాగా.. ఘటనపై స్పందించాడు రమేశ్‌చంద్ర సహానీ. అది తన వారసత్వ ఆస్తి అని.. తన తల్లి ఇచ్చిన డబ్బుగా పేర్కొన్నాడు. ఆ డబ్బు కూడా నబర్ 2021 నవంబర్ 14 నుంచి తన దగ్గరే ఉంటుందని చెప్పుకొచ్చాడు.