పాక్‌ గూఢచారి సంస్థలో పనిచేస్తున్న యూపీ వ్యక్తి అరెస్ట్

ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్.. పాకిస్తాన్ ఆధారిత ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కోసం పని చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసింది.

By అంజి  Published on  17 July 2023 1:56 AM GMT
Uttar Pradesh man, Pakistan spy agency, ISI, ATS Police

పాక్‌ గూఢచారి సంస్థలో పనిచేస్తున్న యూపీ వ్యక్తి అరెస్ట్

ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS).. పాకిస్తాన్ ఆధారిత ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం పని చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసింది. మహ్మద్ రయీస్ అనే నిందితుడు పాకిస్థాన్ హ్యాండ్లర్లకు భారత సైనికులకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందిస్తున్నాడని యూపీ ఏటీఎస్ ఆదివారం తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోండాలోని తారాబ్‌గంజ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ రయీస్, అర్మాన్ ముంబైలో పనిచేస్తున్నప్పుడు అతనితో పరిచయం ఏర్పడింది. భారతదేశంలోని ముస్లిం సమాజ సభ్యులపై అణచివేతకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ అర్మాన్ తనను ప్రేరేపించడానికి ప్రయత్నించాడని రయీస్ పోలీసులకు చెప్పాడు.

విచారణ సమయంలో తాను పని కోసం సౌదీ అరేబియాకు వెళ్లాలనుకుంటున్నానని అర్మాన్‌తో చెప్పినట్లు రయీస్ పేర్కొన్నాడు. అర్మాన్ పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తికి తన నంబర్‌ను ఇస్తానని రయీస్‌కు చెప్పాడు. భారతదేశానికి వ్యతిరేకంగా గూఢచర్యం చేయమని అతనిని ఒప్పించాడు. ఆ పనులకు బదులుగా అతనికి ఉదారమైన మొత్తాన్ని ఇస్తానని రయీస్‌కు చెప్పారు. 2022లో రయీస్‌కి విదేశీ నంబర్‌ నుంచి కాల్ వచ్చిందని ఏటీఎస్ తెలిపింది. ఆ వ్యక్తి తనను హుస్సేన్‌గా పిలుచుకుని, తాను పాకిస్థాన్ గూఢచారి అని చెప్పాడు.

సైనిక కంటోన్మెంట్లు, సైనిక క్యాంపుల గురించి సమాచారాన్ని పంపే బాధ్యత రయీస్‌కు ఇచ్చాడు. గూఢచర్యం కోసం రయీస్ తన స్నేహితుడితో పాటు మరికొంతమందిని కూడా కలుపుకున్నాడు. ప్రతిఫలంగా రయీస్ పాక్ గూఢచారుల నుంచి రూ.15,000 పొందాడు. నిఘా, రయీస్ కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నాయని లక్నోలోని ఏటీఎస్‌ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించడానికి అతన్ని పిలిచినట్లు యూపీ ఏటీఎస్‌ తెలిపింది. గోండాకు చెందిన రయీస్‌ను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది. అతన్ని ఏటీఎస్‌ ప్రధాన కార్యాలయానికి పిలిపించి విచారించారు. విచారణలో అతను గూఢచర్యానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు అని స్పెషల్‌ డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.

రయీస్‌పై లక్నో ఏటీఎస్‌ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్లు 121, 123, అధికారుల రహస్యాల చట్టం, 1923 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.

Next Story