ర్యాష్ డ్రైవింగ్.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన కారు (వీడియో)
ఉత్తర్ ప్రదేశ్‌లో ట్రాఫిక్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను ఓ కారు ఢీకొట్టింది.
By Srikanth Gundamalla Published on 5 Dec 2023 2:44 PM ISTర్యాష్ డ్రైవింగ్.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన కారు (వీడియో)
పట్టణాల్లో రద్దీగా ఉండే రోడ్లపై కొందరు వాహనాలతో వేగంగా దూసుకెళ్తుంటారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఇతరుల ప్రాణాలకు హాని తలపెడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెబుతూ.. ట్రాఫిక్ పోలీసులు తమ విధులు నిర్వర్తిస్తుంటారు. వేగంగా దూసుకెళ్తున్న వారిని.. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిని ఆపి ఫైన్ విధించడం వంటివి చేస్తారు పోలీసులు. అయితే.. కొందరు దుండగులు పోలీసులు అడ్డుకున్నా వాహనాలను ఆపకుండా అలాగే మీదకు దూసుకు వస్తుంటారు. ఇలాంటి ఘటనలు మనం చాలా చూశాం. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని అవధ్ ప్రాంతంలో ఉన్న కూడలి వద్ద వాహన రాకపోకలను నియంత్రిస్తూ ఓ కానిస్టుబుల్ విధులు నిర్వర్తిస్తున్నాడు. వేళ కావడంతో రద్దీ కూడా అంత ఎక్కువగా కూడా లేదు. అయితే.. రాంగ్ రూట్‌లో మొదట ఒక కారును తీసుకొచ్చేందుకు ఓ డ్రైవర్ ప్రయత్నం చేశాడు. అయితే.. అక్కడ కానిస్టేబుల్ ఉండటం గమనించిన అతను.. కారు యూటర్న్ తీసుకుని వెళ్లిపోయాడు. అదే రాంగ్ రూట్‌లో వచ్చిన మరో కారు మాత్రం ఆగలేదు. అలాగే ముందుకు వచ్చింది. విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఒక్కసారిగా వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఆ కానిస్టేబుల్ రోడ్డుపైనే పడిపోయాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా..ఈ ప్రమాదంలో గాయపడ్డ కానిస్టేబుల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయాలు అయ్యాయని.. అతను కోలుకుంటున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌నే ఢీకొనడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. భద్రత ఎక్కడుంది అంటూ ప్రశ్నిస్తున్నారు.
लखनऊ के अवध चौराहे पर हादसा..
— Suraj Shukla (@suraj_livee) December 4, 2023
बेअन्दाज़ शख्स ने उल्टी दिशा में कार दौड़ाई और ट्रैफिक सिपाही पर चढ़ा दी
हादसे के बाद चालक कार लेकर भाग निकला, घायल सिपाही अस्पताल में भर्ती
पुलिस ने फुटेज की मदद से चालक अभिषेक दास को गिरफ्तार किया..@lkopolice pic.twitter.com/25izaQmiCc