కుప్పకూలిన మూడంతస్తుల భవనం, ఇద్దరు మృతి

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఉన్నట్లుంటి ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది.

By Srikanth Gundamalla  Published on  4 Sept 2023 10:59 AM IST
Uttar Pradesh, Building Collapse, Two Dead,

కుప్పకూలిన మూడంతస్తుల భవనం, ఇద్దరు మృతి

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఉన్నట్లుంటి ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారని తెలుస్తోంది. అంతేకాదు.. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే.. ఒక్కసారిగా బిల్డింగ్ కూలడంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్నవారు భయాందోళనకు గురయ్యారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీలో జరిగింది ఈ ప్రమాదం. తెల్లవారుజామున 3 గంటలకు మూడు అంతస్తుల భవనం కుప్పకూలినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే.. తమకు ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. అయితే.. ఇప్పటి వరకు శిథిలాల కింద చిక్కుకున్న 12 మంది బయటకు సురక్షితంగా తీసినట్లు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. మరో ఇద్దరు ముగ్గురు శిథిలాల కింద ఉండొచ్చని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని ఇప్పటికే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

అయితే.. దురదృష్టవశాత్తు బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఒక్కసారిగా భారీ భవనం ఇళ్ల మధ్యన కూలిపోవడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొందని చెప్పారు. భవనం కూలిపోయిన ఘటనపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. భవనం పాతబడి ఉండి ఈ ప్రమాదం జరిగి ఉంటే భవనం యజమానిపై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.

Next Story