పునర్జన్మ గురించి చెబుతోన్న బాలుడు.. ఆశ్చర్యపోతున్న కుటుంబ సభ్యులు

ఓ ఎనిమిదేళ్ల కుర్రాడు పునర్జన్మ గురించి మాట్లాడుతున్నాడు. అమ్మమ్మ గత జన్మలో తన భార్య అని.. తల్లి తన కుమార్తెగా..

By Srikanth Gundamalla  Published on  18 Jun 2023 11:07 AM IST
Uttar Pradesh, Minepuri, 8 Years Boy, Past Birth

పునర్జన్మ గురించి చెబుతోన్న బాలుడు.. ఆశ్చర్యపోతున్న కుటుంబ సభ్యులు

ఇంట్లో పిల్లలకు తాతయ్య పోలికలో.. లేదంటే కుటుంబ సభ్యుల్లో మరెవరివైనా పోలికలు వస్తే ఎంతో సంబరపడిపోతారు. అచ్చం ఆయనలానే ఉన్నావంటూ ఊరికే అంటూంటారు. పోలికల వరకు ఓకే కానీ.. పునర్జన్మ గురించి మాట్లాడితే..? కచ్చితంగా ఆశ్చర్యపోతాం కదా.! సరిగ్గా ఇలాంటి ఘటనే ఉత్తర్‌ ప్రదేశ్‌లో జరిగింది. ఓ బాలుడు పునర్జన్మ గురించి మాట్లాడుతున్నాడు. గత జన్మలో తన తల్లి కూతరని.. అమ్మమ్మ తన భార్య అని.. మామయ్యలు కుమారులని చెబుతున్నాడు.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఓ ఎనిమిదేళ్ల కుర్రాడు పునర్జన్మ గురించి మాట్లాడుతున్నాడు. అమ్మమ్మ గత జన్మలో తన భార్య అని.. తల్లి తన కుమార్తెగా.. మేనమామలు ఇద్దరూ తన కుమారులని చెబుతున్నాడు. ఆ చిన్నోడి మాటలను ముందు కుటుంబ సభ్యులు సరదాగానే తీసుకున్నారు. కానీ ఆ బాలుడు గత జన్మలో చేసిన పనుల గురించి చెబుతుండటంతో కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే.. 2015 జనవరి 9న బాలుడి తాత మనోజ్‌ మిశ్ర కాలం చేశారు. రతన్‌పుర్లో పొలానికి నీళ్లు పారించేందుకు వెళ్లిన సమయంలో ఆయనని పాము కాటు వేసింది. దాంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలోనే పెద్దాయన కుమార్తె రంజన నిండు గర్భిణిగా ఉంది. ఆ తర్వాత మనోజ్ చనిపోయిన 20 రోజులకే రంజనికి డెలివరీ అయ్యింది. ఆ బాలుడికి ఆర్యన్‌ అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. అయితే.. బాలుడికి ఇప్పుడు 8 ఏళ్లు కాస్త తెలివికి వచ్చాడు. తన పేరు ఆర్యన్‌ కాదని.. మనోజ్‌మిశ్రా అని చెబుతున్నాడు. ఈ మధ్య అమ్మమ్మ ఇంటికి వెళ్లాకే ఇలా విచిత్రంగా ప్రవర్తిన్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ముందు ఆశ్చర్యపోయినా.. తర్వాత తేరుకున్నారు. తమ తండ్రే మళ్లీ తిరిగివచ్చాడన్న సంతోషంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎవరికీ తెలియని విషయం కూడా చెబుతున్నాడు ఆర్యన్. గత జన్మలో తన పేరిట బ్యాంకులో డబ్బులు దాచానని చెప్తున్నాడు. అయితే.. ఈ వార్త స్థానికంగా వైరల్‌ అవుతోంది. స్థానికులంతా బాలుడి ఇంటి వద్దకు చేరుకున్న అతను చెబుతోన్న మాటలు విని ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా ఇక తిరిగిరాడనుకున్న తండ్రి తన కడుపున మళ్లీ పుట్టడంతో ఆ తల్లి కూడా ఎంతో సంతోష పడుతోంది.

Next Story