ఆన్ లైన్ లావాదేవీల కోసం యుపీఐ యాప్ ల వినియోగం ఎక్కువవుతోంది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలోనూ డిజిటల్ చెల్లింపుల్లో పెద్ద ఎత్తున ప్రజల్లో మార్పు వచ్చింది. ఇక యూపీఐ యాప్ లు కూడా పలు ఆఫర్లను ప్రకటిస్తూ ఉండడంతో వాటి వైపు ఆకర్షితులవుతూ ఉన్నారు. యుపీఐ ప్లాట్‌ఫాం ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేసేవారికి ముఖ్య గమనిక చేసింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పిసిఐ). యుపీఐ ప్లాట్‌ఫాం అప్‌గ్రేడ్ చేస్తూ ఉండడంతో.. రాబోయే కొద్ది రోజులు పాటు రాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు డిజిటల్ పేమెంట్స్ చేయకండని యుపీఐ యూజర్లకు సూచించింది. అది మొత్తం ఎన్ని రోజులు అనేది ఎన్‌పిసిఐ చెప్పలేదు. రాబోయే కొద్ది రోజులు మాత్రమే అని చెబుతూ ఉన్నారు.
వినియోగదారులు ఎన్‌పిసిఐ పేర్కొన్న సమయంలో లావాదేవీలు చేయకుండా ఉంటే మంచిది. యుపీఐ ని అప్‌గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలో రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్యలో పేమెంట్స్ చేయొద్దని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సూచించింది. అయితే ఎన్ని రోజులనేది స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ రానున్న కొన్ని రోజులు అని తెలిపింది. కాబట్టి యుపిఐ ట్రాన్సాక్షన్ చేసే సమయంలో ఆ సమయాలను కాస్త దృష్టిలో పెట్టుకోవడం మంచిదే..!