ప్రధాని మోదీకి రక్తంతో లేఖ రాసిన ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి
ప్రధాని నరేంద్ర మోదీకి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రి రక్తంతో లేఖ రాశారు.
By Srikanth Gundamalla Published on 22 July 2023 6:31 AM ISTప్రధాని మోదీకి రక్తంతో లేఖ రాసిన ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి
ఎవరైనా సరే ఉన్నత పదవుల్లో ఉన్నవారి నుంచి సహాయం కావాలి అంటే లెటర్ ప్యాడ్ లేకపోతే.. నేరుగా వెళ్లి సమస్యను చెప్పుకుంటారు. కానీ ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ మంత్రి భిన్నంగా వ్యవహించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రి రక్తంతో లేఖ రాశారు. ప్రస్తుతం ఈ సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిషాద్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ కుమార్ నిషాద్ ఉత్తర్ ప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ కేబినెట్‌లో మత్స్యశాఖ మంత్రిగా పని చేస్తున్నారు.
యూపీ మంత్రి డాక్టర్ సంజయ్ కుమార్ నిషాద్ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పెన్‌తోనో.. లేదంటే లెటర్‌ప్యాడ్ టైప్ చేసి పంపితే పెద్ద విషయం అయ్యేది కాదు. కానీ... రక్తంతో లేఖను రాసి పంపారు. మత్స్యకారుల ప్రయోజనాల కోసం తోడ్పాటు అందించాలని ప్రధాని మోదీని లేఖలో విన్నవించారు. తమ నిషాద్ పార్టీ మత్స్యకారుల ప్రయోజనాల కోసమే ఏర్పాటు చేశామని చెప్పారు. మత్స్యకారుల సర్వతోముఖాభివృద్ధే తమ పార్టీ ధ్యేయమని లేఖలో పేర్కొన్నారు. తన జీవితం మత్స్యకారుల సమాజానికి అంకితం చేశానని ఈ సందర్భంగా ప్రధానికి రక్తంతో రాసిన లేఖలో పేర్కొన్నారు యూపీ మంత్రి సంజయ్ కుమార్ నిషాద్. కేంద్రం కూడా మత్స్యకారుల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని.. వారి అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకే పెద్ద పెద్ద అక్షరాలతో కొన్ని పేపర్ల నిండా రక్తంతో లేఖలు రాశారు మంత్రి సంజయ్ కుమార్ నిషాద్.
కాగా.. మంత్రి సంజయ్ కుమార్ నిషాద్ ఇలా రక్తంతో లేఖలు రాయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సమయంలోనూ ప్రధానికి, సీఎం ఆదిత్యనాథ్‌కు కూడా రక్తంతోనే లేఖలు రాసి.. అందరి దృష్టిని తన వైపు ఆకర్షించుకున్నారు.
डॉक्टर संजय निषाद ने खून से लिखा पत्रनिषाद पार्टी के राष्ट्री अध्यक्ष ने पीएम मोदी को खून से लिखा पत्रसमाज को एक जुट करने के लिए लिखा खून से पत्र pic.twitter.com/ebuDAs9Kls
— Sumit Shrivastav (@Shivmay05) July 21, 2023