పోలీసుల‌కు సీఎం సీరియ‌స్ వార్నింగ్‌

UP CM Yogi Adityanath serious warning to the police.ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసుల‌కు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్య‌నాథ్ గ‌ట్టి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Oct 2021 7:29 AM GMT
పోలీసుల‌కు సీఎం సీరియ‌స్ వార్నింగ్‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసుల‌కు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్య‌నాథ్ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎవ‌రైనా స‌రే అక్ర‌మాల‌కు పాల్ప‌డితే ఎట్టి ప‌రిస్థితుల్లో స‌హించేది లేద‌ని.. తీవ్ర‌మైన నేరాల్లో పోలీసుల జోక్యం ఉన్న‌ట్లు తేలితే వెంట‌నే స‌ద‌రు పోలీసుల‌ను డిస్మిస్ చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఇటీవల కాన్పూర్‌కు చెందిన ఓ వ్యాపారి.. పోలీసుల దాడిలో గోరఖ్‌పూర్‌లో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. వ్యాపారి మృతి రాష్ట్ర రాజ‌కీయాల్లో పెద్ద దుమారాన్నే రేపింది. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త తీరుపై విప‌క్షాల నుంచి పెద్ద ఎత్తున విమ‌ర్శులు వ‌చ్చిన నేప‌థ్యంలో సీఎం యోగి ఆదిత్య‌నాథ్ స్పందించారు.

పోలీస్ ఉన్నతాధికారులో సీఎం స‌మావేశ‌మ‌య్యారు. పోలీసుల అక్ర‌మాల‌పై ఇటీవ‌ల ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని.. అలాంటి వ్య‌క్తుల‌కు పోలీస్ శాఖ‌లో స్థానం లేద‌ని.. నిబంధ‌న‌ల ప్ర‌కారం స‌ద‌రు పోలీసుల‌పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఆధారాల‌తో స‌హా అలాంటి పోలీసుల జాబితాను సిద్దం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కళంకిత అధికారులను పోలీసు వ్యవస్థలో ప్రధాన పదవుల్లో నియమించరాదని చెప్పారు.

హోట‌ల్‌లో మ‌ర‌ణించిన వ్యాపారి కుటుంబాన్ని ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ ప‌రామ‌ర్శించారు. వ్యాపారి భార్య‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. రూ.10ల‌క్ష‌ల సాయాన్ని అందించాల‌ని జిల్లా అధికార యంత్రాగాన్ని సీఎం ఆదేశించారు.

Next Story