కుంభమేళాలో కేంద్రహోంమంత్రి అమిత్ షా పుణ్యస్నానం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న కుంభమేళాలో కేంద్రహోంమంత్రి అమిత్ షా పుణ్యస్నానం ఆచరించారు.

By Knakam Karthik
Published on : 27 Jan 2025 3:24 PM IST

National News, Home Minister AmitShah, Uttarpradesh, Prayagraj, Kumbhmela

కుంభమేళాలో కేంద్రహోంమంత్రి అమిత్ షా పుణ్యస్నానం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న కుంభమేళాలో కేంద్రహోంమంత్రి అమిత్ షా పుణ్యస్నానం ఆచరించారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమిత్ షాతో పాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యోగా గురువు రాందేవ్ బాబా కూడా పుణ్యస్నానమాచరించారు. ఈ కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ నెల 29న మౌని అమావాస్య కావడంతో ఆ రోజున 8 కోట్ల నుంచి 10 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 45 రోజుల పాటు జరగనున్న ఈ కుంభమేళాలో ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

Next Story