2024-25 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఎన్‌పీఎస్ వాత్సల్య పథకాన్ని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 18న ప్రారంభించనున్నారు. పాఠశాల పిల్లలు కూడా లాంచ్‌లో పాల్గొంటారు. రేపు ఈ స్కీమ్ విధివిధానాలను కేంద్రమంత్రి తెలియజేయనున్నారు. ఎన్‌పీఎస్ వాత్సల్యకు సభ్యత్వం పొందడం, స్కీమ్ బ్రోచర్‌ను విడుదల చేయడం, కొత్త మైనర్ సబ్‌స్క్రైబర్‌లకు శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య కార్డులను పంపిణీ చేయడం కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా ప్రారంభిస్తారు.
18 ఏళ్లలోపు బాలబాలికల పేరుతో తల్లిదండ్రులు ఈ ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతాను తెరవొచ్చు. దీంతో ముందుగానే పెట్టబడులు పెట్టేందుకు వీలవుతుంది. చక్రవడ్డీతో పాటు అదనపు పన్ను మినహాయింపులు ఉంటాయి. 18 ఏళ్ల తర్వాత ఇది సాధారణ ఎన్‌పీఎస్ ఖాతాగా మారుతుంది. పిల్లల్లో పొదుపు, ఆర్థిక బాధ్యతలపై అవగాహన కలిగించడం కూడా ఈ పథకం ఆశయాలు. భారత పౌరులతో పాటు ఎన్‌ఆర్‌ఐలు, ఓవర్సీస్ సిటిజెన్స్ కూడా తమ పిల్లల పేరున ఈ ఖాతాలను ప్రారంభించవచ్చు. ఏడాదికి కనీసం 1,000 జమ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు. ఈ పొదుపు ద్వారా తల్లిదండ్రులు పన్ను మినహాయింపు పొందవచ్చు.
రేపు ఈ పథకం ప్రారంభ కార్యక్రమం న్యూఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 75 ప్రదేశాలలో ఏకకాలంలో నిర్వహించబడతాయి. ఇతర ప్రదేశాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంచ్‌లో చేరతాయి. ఆ స్థానంలో ఉన్న కొత్త మైనర్ సబ్‌స్క్రైబర్‌లకు కూడా PRAN సభ్యత్వాన్ని పంపిణీ చేస్తుంది.