BUDGET: కొత్త ఐటీ శ్లాబులు ఇవే.. వీటి ధరలు తగ్గుతాయ్
బడ్జెట్‌లో కేంద ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను శ్లాబులను ప్రకటించారు.
By అంజి Published on 1 Feb 2025 1:10 PM ISTBUDGET: కొత్త ఐటీ శ్లాబులు ఇవే.. వీటి ధరలు తగ్గుతాయ్
బడ్జెట్‌లో కేంద ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను శ్లాబులను ప్రకటించారు. వచ్చే వారం పార్లమెంట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్( ప్రత్యేక వ్యక్తిగత ఆదాయపు పన్ను) బిల్లు ప్రవేశపెట్టునున్నట్లు తెలిపారు. ఈ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్‌లో అనవసరపు సెక్షన్లను తొలగిస్తామని తెలిపారు.
కొత్తగా ప్రకటించిన ఐటీ శ్లాబులు ఇవే
- 0 - రూ.4 లక్షల వరకు సున్నా
-రూ.4 లక్షల - రూ.8 లక్షల వరకు 5 శాతం
-రూ.8 లక్షల - రూ.12 లక్షల వరకు 10 శాతం
- రూ.12 లక్షల - రూ.16 లక్షల వరకు 15 శాతం
-రూ.16 లక్షల - రూ.20 లక్షల వరకు 20 శాతం
- రూ.20 లక్షల - రూ.24 లక్షల వరకు 25 శాతం
- రూ.24 లక్షలకుపైగా 30 శాతం ట్యాక్స్ ఉండనుంది.
వీటి ధరలు తగ్గింపు:
మొబైల్ ఫోన్స్, ఈవీ బ్యాటరీస్, మెరైన్ ప్రొడక్ట్స్, ఎల్‌ఈడీ, వెట్ బ్లూ లెదర్, ఓపెన్ సెల్, 36 లైఫే సెవింగ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్, ఫ్రోజెన్ ఫిష్ పేస్, కారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లు, 25 రకాల క్రిటికల్ మినరల్స్, జింక్, లిథియం - అయాన్ బ్యాటరీ స్క్రాప్‌ల ధరలు తగ్గనున్నాయి. అలాగే ప్లాట్ ప్యానెల్ డిస్‌ప్లే, నైటెడ్ ఫ్యాబ్రిక్స్ ధరలు పెరగనున్నాయి.
బడ్జెట్‌లో కీలక అంశాలు
- ఆదాయ పన్ను పరిధి రూ.12 లక్షలకు పెంపు
- అద్దెలపై వార్షిక టీడీఎస్ పరిధి రూ.6 లక్షలు
-స్టార్టప్స్ మొదలైన నాటి నుంచి 5 ఏళ్ల పాటు ప్రయోజనాలు
- బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిధి 100 శాతానికి పెంపు
- పదేళ్లలో 100 స్థానిక ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం
- వచ్చే ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లు
- 2028 వరకు జల్ జీవన్ మిషన్ పొడిగింపు
- కిసాన్ క్రిడెట్ కార్డు రుణం రూ.5 లక్షలకు పెంపు