UIDAI: ఆధార్‌ అప్‌డేషన్‌ 3 నెలల పాటు ఉచితం

ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాలనుకుంటున్న వారికి యూఐడీఏఐ గుడ్‌న్యూస్‌.. ఆధార్‌ వివరాలను ఫ్రీగా అప్‌డేట్‌ చేసుకోవచ్చని..

By అంజి  Published on  16 March 2023 3:45 PM IST
UIDAI ,Aadhaar update

UIDAI: ఆధార్‌ అప్‌డేషన్‌ 3 నెలల పాటు ఉచితం

మీరు ఆధార్‌ కార్డ్‌ తీసుకుని 10 ఏళ్లు గడిచిందా? అయితే ఆధార్‌ కార్డ్‌ని వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడం తప్పనిసరి. తాజాగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాలనుకుంటున్న వారికి యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ ఆధారిటీ ఆఫ్‌ ఇండియా గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆధార్‌ వివరాలను ఫ్రీగా అప్‌డేట్‌ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఈ ఫెసిలిటీ కేవలం ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే. డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా యూఐడీఏఐ దీనిని తీసుకువచ్చింది. 3 నెలల పాటు మాత్రమే ఆన్‌లైన్‌లో ఈ ఫ్రీ అప్‌డేట్‌ ఛాన్స్‌ ఉంది. 3 నెలల తర్వాత మాత్రం చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

మీఫోన్‌లో లేదా కంప్యూటర్‌లో.. మై ఆధార్ వెబ్‍సైట్/పోర్టల్‍(myaadhaar.uidai.gov.in)కు వెళ్లి ఆధార్ వివరాలను అప్‍డేట్ చేసుకుంటే ఉచితం. అయితే ఆధార్‌ సెంటర్‌ వెళ్లి అప్‌డేట్‌ చేసుకుంటే మాత్రం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 15 వ తేదీ నుంచి జూన్‌ 14వ తేదీ వరకు ఎలాంటి ఖర్చు లేకుండా ఆన్‌లైన్‌లో ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేసుకోవచ్చని యూఐడీఏఐ తెలిపింది. మై ఆధార్ పోర్టల్‍లో మీ ఆధార్ కార్డులోని పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలను మార్చుకోవచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేసుకోవాలనుకుంటే.. దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ (ప్రూఫ్)ను అప్‍లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఇలా అప్‍డేట్ చేసుకోండి..

- మైఆధార్ పోర్టల్ https://myaadhaar.uidai.gov.in/ లోకి వెళ్లాలి.

- అక్కడ లాగిన్ బటన్‍పై క్లిక్ చేసి.. ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ ఎంటర్ చేయాలి.

- మీ ఆధార్ కార్డుకు రిజిస్టర్ అయిన మొబైల్‍కు ఓటీపీ వస్తుంది.

- ఓటీపీ ఎంటర్ లాగిన్ బటన్‍పై క్లిక్ చేయాలి.

- మీరు మార్చుకోవాలనుకున్న వివరాలను ఎంపిక చేసుకోవాలి.

- సపోర్టెడ్ డాక్యుమెంట్‍ను అప్‍‍లోడ్ చేయాలి.

Next Story