మంత్రివ‌ర్గంలోకి ముఖ్య‌మంత్రి కుమారుడు

Udhayanidhi Stalin all set to become Tamil Nadu Minister tomorrow.త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Dec 2022 8:54 AM IST
మంత్రివ‌ర్గంలోకి ముఖ్య‌మంత్రి కుమారుడు

త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉద‌య‌నిధి స్టాలిన్‌కు మంత్రి ప‌దవి ఖాయ‌మైంది. ఈ నెల 14న‌(బుధ‌వారం) ఉద‌యం 9.20 గంట‌ల‌కు రాజ్‌భ‌వ‌న్‌లో ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని రాజ్‌భ‌వ‌న్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

రాష్ట్ర మంత్రివర్గంలోకి ఉధయనిధిని తీసుకోవాలంటూ ఇటీవల డీఎంకే చీఫ్‌, ముఖ్యమంత్రి స్టాలిన్ పంపిన సిఫారసుకు గవర్నర్‌ సీటీ రవి ఆమోదం తెలిపారు. 2021 శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో చెన్నైలోని చేపాక్‌-ట్రిఫ్లికేన్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి డీఎంకే అభ్య‌ర్థిగా ఉద‌య‌నిధి తొలిసారిగా గెలిచారు. వార‌స‌త్వ రాజ‌కీయాలు త‌గ‌వు అంటూ అప్ప‌ట్లో చ‌ర్చ సాగ‌డంతో ఆయ‌న్ను మంత్రి వ‌ర్గంలోకి తీసుకోలేదు. అయితే.. ఇటీవ‌ల ఉద‌య‌నిధికి మంత్రి ప‌దవి ఇవ్వాల‌న్న డిమాండ్లు పెర‌గ‌డంతో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు.

Next Story